కలెక్షన్లలో దూసుకుపోతున్న బాలయ్య శతచిత్రం.. Gautamiputra Satakarni three days collections

Gautamiputra satakarni three days collections

khaidi no 150, gautamiputra shatakarni, megastar chiranjeevi, nataratna nandamuri balkrishna, america collections, shatamanam bavati, sharvanand, telugu movies, tollywood top heros, entertainment

Nandamuri Balakrishna's Gautamiputra Satakarni is doing well at the box office due to superb positive talk for the movie from critics and the audience.

కలెక్షన్లలో దూసుకుపోతున్న బాలయ్య శతచిత్రం..

Posted: 01/15/2017 11:56 AM IST
Gautamiputra satakarni three days collections

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన శతచిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది. వరుస హిట్ చిత్రాలతో ఇప్పటికే పలు రికార్డులను అందుకున్న బాలయ్య, తన  శతచిత్రం (వందవ చిత్రం)లో చారిత్రక నేపథ్యమున్న చిత్రంతో రావడంలో అభిమానులకు సంతోషాలకు అవదులు లేకుండాపోయాయి, ఇక ఈ సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా బాగానే అర్జిస్తున్నాయి. రాబడుతున్నాయి.

ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 20,36 కోట్ల రూపాయలను ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రాబట్టింది. నైజాంలో 4.8 కోట్లు, సీడెడ్ లో 4.34 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2.1, తూర్పులో 1.73, వైజాగ్ లో 2.11, కృష్ణాలో1.63, నెల్లూరులో కోటి రూపాయలను రాబట్టింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్ర ప్రదర్శన హక్కులను నిర్మాత 37.2 కోట్లు విక్రయించగా, ఇప్పటికే ఈ చిత్రం 20.36 కోట్ల రూపాయలను అర్జిందింది. ఇక అదివారం రోజున భారీ కలెక్షన్లను కూడా రాబడుతుందని సినీవర్గాల టాక్. ఇక అమెరికాలో చిత్రం శనివారం ఒక్కరోజు 263 వేల డాలర్లను అర్జించిన ఈ చిత్రం గత మూడు రోజులుగా 937 వేల డాలర్లను అర్జించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh