రీ ఎంట్రీతో బాక్సాఫీసు రికార్డులు బద్దలు.. Khaidi no 150 four days collections

Khaidi no 150 four days collections

khaidi no 150, gautamiputra shatakarni, megastar chiranjeevi, nataratna nandamuri balkrishna, america collections, shatamanam bavati, sharvanand, telugu movies, tollywood top heros, entertainment

Megastar Chiranjeevi's Khaidi no 150 is doing extremely well at box office. The movie minted Rs 44.2 crores share from AP/TS box office in its 4 days run.

రీ ఎంట్రీతో బాక్సాఫీసు రికార్డులు బద్దలు..

Posted: 01/15/2017 10:49 AM IST
Khaidi no 150 four days collections

మెగాస్టార్ చిరంజవీ అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసిన ఖైదీ నెంబర్ 150 చిత్రం విడుదల కావడంలో, దానికి పాజిటివ్ టాక్ రావడం అభిమానులు సంబరాల్లో అవధులు లేకుండా పోయాయి. దీంతో తమ మెగాస్టార్ రీ ఎంట్రీతో బాక్సఫీసు వద్ద రికార్డులు బద్దలు కావడంలో అతిశయోక్తి ఏమీ లేదని ధీమాగా చెబుతున్నారు మెగా ఫ్యాన్స్. అభిమానులు ఊహించినట్లుగానే ఖైదీ నెంబర్ 150 చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే భారీ కలెక్షన్లను రాబట్టింది.

తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 47.7 కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ చిత్రం విడుదలైన గత నాలుగు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో 44.2 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. నైజాం ఏరియాలో 13.32 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం సీడెడ్ లో 7.33 కోట్లు, వైజాగ్ లో 6.75 కోట్లు, గుంటూరులో 3.57, తూర్పు గోదావరిలో 4.81 కోట్లు, పశ్చిమ గోదావరిలో 3.82 కోట్లు, కృష్ణలో 2.83 కోట్లు, నెల్లూరులో 1.77 కోట్ల రూపాయలను అర్జిందింది. ఇక అమెరికాలో శుక్రవారం వరకు 1662 వేల డాలర్లను అర్జించిన ఈ చిత్రం.. శనివారం ఏకంగా 208 వేల డాలర్లను రాబట్టింది.

ఇక అదివారం సినిమాకు కలెక్షన్లు మరింతగా పెరగవచ్చని అంచనా. ఉభయ తెలుగు రాష్ట్రాల కలెక్షన్లతో అదివారం నాటికి ఈ చిత్రం 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరుతుందని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, అమెరికాలోనే అదివారం కలెక్షన్లు పుంజుకుని మొత్తంగా రెండు మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటుందని అంచనాలున్నాయి. మొత్తానికి మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా మారిన తొలి చిత్రం కాసుల వర్షం కురిపించడం కూడా మెగా అభిమానులకు ఆనందాన్నిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh