చరిత్ర సృష్టిస్తూ సాగిపోతున్న దంగల్ Dangal enters 700 crore club at the box office

Dangal enters 700 crore club at the box office

amir khan, dungal, bollywood, box office collections, entertainment

Aamir Khan's Dangal which released on December 23rd is still doing well at the box office even after the end of its 3 weeks run. The movie now entered 700 crores gross club worldwide within 23 days.

చరిత్ర సృష్టిస్తూ సాగిపోతున్న దంగల్

Posted: 01/15/2017 12:59 PM IST
Dangal enters 700 crore club at the box office

పెను సంచలనాలకు దారి తీసిన బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్ సినిమా రికార్డుల దుమ్ముదులుపుతోంది. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టి కనీవిని ఎరుగని రీతిలో ముందుకు దూసుకెళ్తుంది. బాలీవుడ్ లో బాక్సఫీస్ రికార్డుల చరిత్రను తిరగరాస్తూ.. పయనిస్తున్న ఈ సినిమాకు నిన్న మ‌రో 4.06 కోట్ల రూపాయల క‌లెక్ష‌న్లు వచ్చాయి.

ఇప్ప‌టికే భార‌త్‌లో అత్యధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెల‌కొల్పిన దంగల్‌ మరో అరుదైన రికార్డుకు చేరువ‌లో ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి రూ.365.87 కోట్లు వ‌చ్చాయి. ఇక‌ ఈ రోజు కూడా భారీగానే కలెక్షన్లు వ‌స్తాయ‌ని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక 400 కోట్ల రూపాయల మార్క్‌ బిజినెస్‌ను దాటి రికార్డు నెల‌కొల్ప‌డ‌మే త‌రువాయి అని చెబుతున్నారు. దేశంలో 400 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా ఆమిర్ మూవీ నిలిచిపోతుంద‌ని అంటున్నారు.

ఇంతకుముందు భార‌త్‌లో అత్యధిక కలెక్ష‌న్లు రాబ‌ట్టిన‌ సినిమాగా కూడా ఆమిర్ ఖాన్ న‌టించిన సినిమానే ఉంది. పీకే మొద‌టి స్థానంలో, భజరంగీ భాయిజాన్‌ రెండో స్థానాల్లో ఉన్నాయి. వాటిల్లో పీకే 340.8 కోట్లు రాబ‌ట్ట‌గా భజరంగీ భాయిజాన్‌ 320.34 కోట్ల క‌లెక్ష‌న్లు సాధించింది. దేశంలో తొలిసారి 300 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సినిమా కూడా ఆమిర్ ఖాన్ సినిమానే కావ‌డం గ‌మ‌నార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amir khan  dungal  bollywood  box office collections  entertainment  

Other Articles