జెట్ స్పీడుతో నటిస్తున్న చెన్నై సంద్రం Trisha kicks of 2017 in kollywood, tollywood

Trisha kicks of 2017 in kollywood tollywood

Trisha, Nagarjuna, Raju Gaari Gadhi 2, Nagarjuna, Omkar, horror genre m ovie, tollywood, kollywood, cinema, Telugu cinema, entertainmenr

Trisha is being considered for the role of heroine opposite Nagarjuna. She has earlier worked with Nagarjuna in King which turned out to be a dud at the box-office.

జెట్ స్పీడుతో నటిస్తున్న చెన్నై సంద్రం

Posted: 01/08/2017 12:24 PM IST
Trisha kicks of 2017 in kollywood tollywood

పెళ్లి పీటలెక్కే సందర్భంలో సినిమాలకు కొంత దూరమైన చెన్నై బ్యూటీ.. 2017 సంవత్సరం ఆరంభంలో మాత్రం పలు బాషాల్లో ఫుల్ బిజీగా మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్లో జెట్ స్పీడుతో దూసుకుపోతున్న త్రిష..  సినిమాల మీద తన పూర్తి దృష్టి పెట్టింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత పలు కారణాలతో తన పెళ్లి నిలిచిపోవడంతో.. బ్యాక్ టు పెవీలియన్ అంటూ నటనలో ఫుల్ బిజీగా మారింది. ఈ బ్యూటి ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో  పాటు గ్లామర్ రోల్స్ లోనూ అలరిస్తోంది. ఎక్కువగా కోలీవుడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న త్రిష, త్వరలో ఓ సీనియర్ స్టార్ హీరో సరసన తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించింది.

ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ ముందుండే సీనియర్ స్టార్ నాగార్జున హీరోగా తెరకెక్కనున్న సినిమా రాజుగారి గది 2. ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ్కు జోడిగా త్రిష అలరించనుంది. గతంలో కింగ్ సినిమాలో కలిసి నటించిన ఈ జోడి మరోసారి తెర ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో సీరత్ కపూర్ మరో హీరోయిన్గా నటిస్తుండగా.. సమంత కీలక పాత్రలో కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే హీరోయిన్ల ఎంపికపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles