ఆ సీక్రెట్ చెప్పమంటు క్రిష్ ను బతిమాలుతున్నాడు } RGV asks Krish reveal that secret.

Rgv tweets on satakarni and krish

Ram Gopal Varma, Gautamiputra Satakarni, Director Krish, RGV jealous Krish, Varma Krish, Director Krish RGV, Satakarni rights, Gautamiputra satakarni Ram Gopal Varma, RGV tweets, RGV Nagababu

Ram Gopal Varma confirms a big corporate company bought GPSK rights for a whopping price.

క్రిష్ నిన్ను చూస్తే అసూయగా ఉంది-వర్మ

Posted: 01/09/2017 08:36 AM IST
Rgv tweets on satakarni and krish

చిరు ఖైదీ నంబర్ 150పై వర్మ సెటైరిక్ ట్వీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగబాబు ఫైర్ అవ్వటం, మళ్లీ వర్మ తనదైన స్టైల్లో మెగాబ్రదర్ కు పంచ్ ఇవ్వటం ఇలా ఈ వివాదం ఇంతటితో ముగిసేలా లేదు. మళ్లీ ట్వీట్లతో రెచ్చిపోయిన వర్మ నిన్న అంత అరిచి ఇవాళ సైలెంట్ గా ఉండటానికి కారణం, తేలు పిల్ల కుట్టిందా? లేక వానపాము కరిచిందా? అంటూ మరోసారి తన చేతికి పనిచెప్పాడు.

 

ఇది చాలదన్నట్లు ఈ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ మ‌రో ట్వీట్ తో వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి చేసింది మెగా కాంపౌండ్ మీద కాదు.. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి డైరెక్ట‌ర్ క్రిష్‌పై. క్రిష్ ను చూస్తే త‌న‌కు అసూయ‌గా ఉంద‌ని పేర్కొన్నాడు. ముంబైలో పెద్ద కార్పొరేట్ కంపెనీ ఒక‌టి గౌతమిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా చూసింద‌ని, జాతీయ‌, అంత‌ర్జాతీయ హ‌క్కులను అది సొంతం చేసుకుంటోంద‌ని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు.

ముంబైలో సింగిల్ షో తోనే క్రిష్ నాలుగు కంపెనీల‌తో సంత‌కం చేశాడంటూ ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. అంతేకాదు 'హే క్రిష్‌.. నాకు అసూయ‌గా ఉంది'.. అని పేర్కొన్నాడు. వాళ్లు సంత‌కం చేయించుకున్న నాలుగు కంపెనీల్లో ఒక‌టి 'ఏకే’(క్రిష్ కు సంబంధించి) ఒకటి త‌న‌కు తెలుస‌ని, రెండోది 'ఎస్‌కే' అని విన్నాన‌ని పేర్కొన్న వ‌ర్మ అది నిజ‌మో? కాదో క‌న్ఫ‌ర్మ్ చేయాలంటూ ట్విట్ట‌ర్ ద్వారా క్రిష్‌ను అభ్య‌ర్థించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Gautamiputra Satakarni  Rights  Director Krish  tweets  

Other Articles