మీ గుండెల్లో నిత్యనూతన ఖైదీనే: చిరంజీవి Chiranjeevi reveals the story behind Kaththi remake

Chiranjeevi reveals the story behind kaththi remake

Khaidi No 150, pre release function, chiranjeevi, ram charan, allu arjun, dasari narayana rao, dsp, Khaidi No 150 trailer review,Megastar Chiranjeevi,Khaidi trailer 2 million views,Khaidi trailer audience reviews,Khaidi trailer audience response,Director VV Vinayak,Kaththi remake trailer response

The pre release event of Megastar Chiranjeevi’s Khaidi No 150 took place in a grand style. Chiranjeevi has spilled the beans on choosing the title for his comeback movie- remake of Vijay-starrer Tamil movie Kaththi

మీ గుండెల్లో నిత్యనూతన ఖైదీనే: చిరంజీవి

Posted: 01/08/2017 11:30 AM IST
Chiranjeevi reveals the story behind kaththi remake

'రాననుకున్నారా? రాలేననుకున్నారా? ఢిల్లీ వెళ్లాడు, డ్యాన్సు లు మర్చిపోయాడు, హస్తినాపురం వెళ్లాడు హాస్యం మర్చిపోయాడు, మన మధ్య లేడు మాసిజం మర్చిపోయాడు అనుకున్నారా?' అంటూ ఇంద్ర సినిమా డైలాగులను ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి నోట వస్తుంటే.. ఆ డైలాగులకు మెగా అభిమానులు ఈలలు, అరుపులు, కేకలు, కేరింతలు కొడుతుంటే.. సరిగ్గా ఠాగూర్, శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రాల తరువాతే గ్యాప్ తీసుకున్నా.. అలా కాకుండా ఏ ఒక్క అభిమానిని నిరుత్సాహ పర్చకుండా అభిమానుల అంచానాలను మరిన్ని రెట్లు పెరిగినట్లుగా చిరంజీవీ రీ ఎంట్రీ సినిమా తలపించింది.

సుమారు పదేళ్ల గ్యాప్ తీసుకన్నాక కూడా మెగాస్టార్ పై తరగని అభిమానం హాయ్ లాండ్ లో వెల్లివిరిసింది. ’మళ్లీ ఆదే గ్రేసు, హుషారుతో మళ్లీ అభిమానుల ముందుకు వస్తున్నానని ఆయన చెప్పడంతో అభిమానులు పులకించిపోయారు. మెగా అభిమానుల జనసంధ్రం మధ్య చిరంజీవి మాట్లాడుతున్నంత సేపు అభిమానులు చప్పట్లు, ఈలలు వేస్తూ ప్రతీ మాటను చక్కగా ఎంజాయ్ చేశారు. అభిమానుల ఈలలు, చప్పట్లు, కేరింతలు, కోలాహలం విని చాలా కాలమైందని, ఇది ఇంకా సరిపోవడం లేదని చిరంజీవి అన్నారు. అభిమానుల ఈ కోలాహలం చూసి విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నానా? లేక విశాఖ సముద్ర తీరాన ఉన్నానా? అన్న అనుమానం వస్తోందని అన్నారు. సముద్రం హోరును అభిమానుల హోరు మించిపోయిందని అన్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తన స్నేహితుడు రజనీకాంత్ తనతో మాట్లాడుతూ, 'మనల్ని మన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా మన అభిమాని మాత్రమే దర్శకత్వం చేయగలడని అనేవాడని, ఆయన అన్నట్టు తనను వినాయక్ అలాగే చూపించాడని చిరంజీవి కితాబునిచ్చారు. ఖైదీ డ్రెస్ లో ఉన్న తన స్టిల్ చూసి ఈ సినిమాకు 'ఖైదీ నెంబర్ 150' పేరు పెట్టండి అని దాసరి నారాయణరావు సూచించారని, ఆయన సూచించినట్టే ఈ సినిమాకు అదే పేరు పెట్టామని, ఈ పేరు సూచించినందుకు ఆయనకు ధన్యవాదాలని అన్నారు. అలాగే కళలను ఆదరించే టి.సుబ్బరామిరెడ్డికి, తనపై అభిమానంతో వచ్చిన కామినేని, ప్రత్తిపాటి పుల్లారావులకు ధన్యవాదాలని ఆయన చెప్పారు.

2007లో 'శంకర్ దాదా జిందాబాద్' తరువాత 2017 మధ్య 'ఖైదీ నెంబర్ 150' సినిమాకు మేకప్ వేసుకునే మధ్య సమయం క్షణంలా గడిచిపోయిందని ఆయన చెప్పారు. పదేళ్ల తరువాత కూడా పాతికేళ్ల నాటి ఉత్సాహం తనలో నింపిన శక్తి అభిమానులదేనని ఆయన అన్నారు. అదే తనను నడిపిస్తున్న శక్తి అని ఆయన చెప్పారు. ఈ సినిమా కథ కోసం అన్వేషించినప్పుడు విన్న కథలు పూర్తి ఆనందాన్నివ్వలేదని, కొన్ని కథలు బాగున్నా ఎందుకో ఆకట్టుకోలేదని అన్నారు. 'కత్తి' సినిమా చూసినప్పుడు ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఈ సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయని, మంచి సందేశం ఉందని ఆయన తెలిపారు. తమిళ్ హీరో విజయ్, మురుగదాస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కథ అనుకోగానే వినాయక్ ను దర్శకుడుగా పెట్టుకోవాలని అనుకున్నానని, ఆయన కూడా ఆనందంగా అంగీకరించారని చిరంజీవి తెలిపారు. నాగబాబు, కల్యాణ్ లలా వినాయక్ కూడా తన తమ్ముడని ఆయన తెలిపారు.  

తన బాడీలాంగ్వేజ్ కు సరిపోయే సంగీతాన్ని దేవీశ్రీప్రసాద్ ఇచ్చాడని ఆయన చెప్పారు. హుషారైన పాటలతోనే కాకుండా అద్భుతమైన రైతు పాటను కూడా అందించాడని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఫైట్ మాస్టర్స్, ఛాయాగ్రాహకుడు, డాన్స్ మాస్టర్స్ అంతా తనను బాగా చూపించే ప్రయత్నం చేశారని చిరంజీవి తెలిపారు. రామ్ చరణ్ కు నటనలో హద్దులతోపాటు నిర్మాణంలో పద్దులు కూడా తెలుసని చిరంజీవి చెప్పారు. బ్యాంకాక్ షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్, క్రొయేషియాలో ఉన్న తమ యూనిట్ లోని ప్రతి ఒక్కరి చేతిలో 300 యూరోలు ఉండాలని చెప్పాడంటే ఎంతో మంచి నిర్మాత అనిపించుకున్నాడని చిరంజీవి ప్రశంసించారు. పరుచూరి సోదరులతో తన అనుబంధం 'ఖైదీ'తో బలోపేతమైందని, ఇప్పటివరకు బలంగా సాగిందని ఆయన తెలిపారు.  

అభిమానుల నిరీక్షణ ఖైదీతో ఫలించింది..

'ఎక్కడ చిరంజీవి ఉంటే అక్కడ జనసముద్రం ఉంటుంది. ఎన్నాళ్లైంది.. ఇలాంటి జనసముద్రాన్ని చూసి' అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, ఒక 'ఖైదీ', 'పసివాడి ప్రాణం', 'ఘరానా మొగుడు' ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఎన్నో అద్భుతమైన ఫంక్షన్స్ జరిగాయని ఆయన చెప్పారు. 8 ఏళ్ల తరువాత హీరో నటించడమనేది చిరంజీవి విషయంలోనే సాధ్యమైందని ఆయన చెప్పారు.

ఎప్పుడు చిరంజీవి మేకప్ వేసుకుని, నటిస్తారా? సినిమా ఎప్పుడు చూస్తామా? అని ఎదురు చూసిన మెగా అభిమానులకు సమాధానమే 'ఖైదీ నెంబర్ 150' అని ఆయన చెప్పారు. 'ఖైదీ' సినిమా తరువాత మెగాస్టార్ గా ఎదిగేందుకు ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసని ఆయన అన్నారు. 8 ఏళ్ల తరువాత ఫైట్స్ చేస్తాడా? డాన్సులు చేస్తాడా? నటించగలడా? అని సందేహాలు వ్యక్తం చేసిన వారికి సమాధానమే ఈ సినిమా అని ఆయన తెలిపారు. తన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఆయన కనిపించారని ఆయన చెప్పారు. అభిమానులు ఆశ్చర్యపోయేలా ఆయన ఉంటారని దాసరి చెప్పారు.

ఈ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ లో కల్యాణ్, రామ్ చరణ్ కూడా సరిపోరని అంటారని ఆయన చెప్పారు. ఈ రోజు కలెక్షన్లతో దూసుకుపోతున్న వారంతా చిరంజీవిలా డాన్స్ చేయాలని కోరుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. సంక్రాంతి పండగకు ముందు '11నే సంక్రాంతి వచ్చినట్టే లెక్క' అని ఆయన అన్నారు. ఈ కథ తనకు తెలుసని చెప్పారు. ఈ సినిమా కధలో అన్ని అంశాలు ఉన్నాయని, 'ఠాగూర్'  రికార్డులు సవరించే మంచి సినిమా వస్తోందని ఆయన తెలిపారు. రైతు సమస్యలు తెలియజేసేలా అద్భుతమైన సినిమా అని ఆయన చెప్పారు. పాటలు, ఫైట్స్, స్టోరీ బాగుందని, అభిమానులకు ఇంకేంకావాలని ఆయన అభిమానులను ఉద్దేశించి అన్నారు.  

అభిమానుల అంచనాలను మించి వుంటుంది: వివి వినాయక్

అన్నయ్య చిరంజీవి ఒక మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. తన తండ్రి తరువాత పెద్దన్నయ్య రూపంలో తన తప్పులు సరిదిద్దినందుకు ఆయనకు ధన్యవాదాలని అన్నారు. అన్నయ్య సినిమా నుంచి ఏం కోరుకుంటారో... అవన్నీ ఈ సినిమాలో ఉంటాయని, అభిమానులందర్నీ ఈ సినిమా అలరిస్తుందని ఆయన చెప్పారు. మరోలా చెప్పాలంటూ మెగా అభిమానుల అంచనాలు మించి ఖైదీ నెంబర్ 150 ఉంటుందని అన్నారు. సినిమా సూపర్ హిట్ అని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles