ఆ సీక్రెట్ రివీల్ చేసిన కోడి రామకృష్ణ senior director kodi ramakrishna reveals secrets

Senior director kodi ramakrishna reveals secrets

kodi ramakrishna, sr director, wrist threads, rings, forehead band, naghabharanam movie, naghabharanam release, vishnuvardhan, celebrities, movies, music, headlines, gossips, news, bollywood, tollywood

tollywood senior director kodi ramakrishna reveals secrets of his wrist threads and fore head band. he also said he perfoms pooja daily

ఆ సీక్రెట్ రివీల్ చేసిన కోడి రామకృష్ణ

Posted: 10/10/2016 02:33 PM IST
Senior director kodi ramakrishna reveals secrets

డైరెక్టర్ కోడి రామకృష్ణ గురించి తెలియని వారుండరు. ఆయన గురించి చెప్పాలంటే.. ఆయన కన్నా ఎక్కువగా ఆయన మానెరిజమ్ ఫేమస్ అయ్యింది. తలకు బట్టకట్టుకుంటారే ఆ డైరెక్టర్ అంటే గుర్తుపట్టని తెలుగు సినీ ప్రేక్షకుడు వుండడు. ఈ విషయాన్ని ఆయన కూడా స్వచ్చంధంగా అంగీకరిస్తారు. ఇలా కూడా తెలయదన్న ప్రేక్షకులకు ఆయన చిత్రాలు మాత్రం సుపరిచయమే. భారత్ బంద్, దేవుళ్లు, అమ్మోరు ఇలా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి అనేక రకాల ఎవరగ్రీన్ చిత్రాలలో ఆయన మార్కు కనబడుతుంది. అయితే ఆయన తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో తన సీక్రెట్ ను రివీల్ చేశారు.

తన చేతికి తాళ్లు వుండటం, వేళ్లకు ఉంగరాలు వుండటం వెనక సీక్రెట్ ను రివీల్ చేశారు. తాను ప్రతి రోజు దైవారాధన క్రమం తప్పకుండా చేస్తానని.. అయితే ఫ్రీగా ఉంటే 3 గంటలు.. బిజీగా ఉంటే అరగంట పాటు పూజ చేస్తానని అన్నారు. దీని వెనుక కథ ఏమిటీ ఎందుకంతలా పూజ చేస్తారన్న సీక్రెట్ తెలుసుకోవాలని వుందా..? ఒక రోజు ఆయన కాలువలో పడి కొట్టుకుపోతుంటే.. మధ్యలో ఒక వ్యక్తి నన్ను బతికించాడు. ఈ విషయాన్ని ఇంటికెళ్లిన తరువాత వాళ్ల అమ్మకు చెప్పాడు. అంతే ఆమె అతడ్ని బాధ, కోపం, ప్రేమతో నన్ను బాగా కొట్టింది. ఆ తరువాత దేవుడికి దండం పెట్టకుండా, పూజ చేయకుండా బయటకు వెళ్లొద్దురా అని ఆరోజు చెప్పిన మాట ఈరోజు వరకు ఆయన పాటిస్తూనే ఉన్నారు.

ఇక, షూటింగ్ సమయంలో నా తలకు కట్టుకునే బ్యాండ్ గురించి చెప్పాలంటే... నా రెండో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సమయం అది. బాగా ఎండగా ఉంది. ఇంతలో చిత్ర యూనిట్ లో వాళ్లు ఒకరు వచ్చి నా నుదురుకు ఎండ తగలకుండా కట్టుకోమని ఒక క్లాత్ ఇచ్చారు. ‘నీ ఫోర్ హెడ్ పెద్దది. ఎండ బాగా తగులుతుంది. ఇది కట్టుకో’ అని అన్నారు. ఇక, అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పద్ధతి. నా కన్నా ఎక్కువగా నా తలకు కట్టుకునే బ్యాండ్ ఫేమస్ అయిపోయింది’ అని కోడి రామకృష్ణ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodi ramakrishna  sr director  wrist threads  rings  forehead band  tollywood  

Other Articles