surya | 24 movie | audio release date | Samantha | Nithya menon

Actor ajay talks about 24 movie

24 movie audio release date, 24 Official Teaser, 24 Teaser, 24 Tamil Teaser, 24 Telugu Teaser, 24 movie posters, 24 movie stills, Surya 24 teaser, Surya movie stills, Surya teaser, Surya

Actor Ajay talks about 24 movie: Tamil Hero Surya upcoming film 24. Vikram kumar direction, Samantha, Nithya menon heroines, AR Rahaman music.

సూర్య ‘24‘పై నమ్మకంతో వున్న అజయ్

Posted: 04/07/2016 08:58 AM IST
Actor ajay talks about 24 movie

తెలుగులో ‘పోకిరి’, ‘విక్రమార్కుడు’, ‘ఇష్క్’ చిత్రాలతో నటుడిగా మంచి పేరును దక్కించుకున్న అజయ్... ప్రస్తుతం తెలుగు, తమిళం భాషలలో రూపొందుతున్న ‘24’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళ స్టార్ సూర్య హీరోగా సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమా తనకు మంచి పేరును తెచ్చిపెడుతుందని, దర్శకుడు విక్రమ్ కుమార్ తనకు అద్భుతమైన పాత్రను ఇచ్చాడని, ఈ పాత్ర తనకు మంచి బ్రేక్ అవుతుందని అజయ్ తెలియజేసారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫోటోలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఏప్రిల్ 11న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

ప్రెస్టీజియస్ సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో గ్లోబర్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే తెలుగు, తమిళం భాషలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

సూర్య, సమంత, నిత్యామీనన్, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక నిపుణులు... సంగీతం : ఎ.ఆర్.రెహమాన్; సినిమాటోగ్రఫి – కె.తిరునాపుక్కరసు; ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి; ప్రొడక్షన్ డిజైన్ – అమిత్ రే మరియు సుభ్రదా చక్రబోర్తి; పాటలు – చంద్రబోస్ మరియు శశాంక్ వెన్నెలకంటి; సౌండ్ డిజైన్ – లక్ష్మీ నారాయణన్; సౌండ్ ఎఫెక్ట్స్ – ఇక్బాల్; యాక్షన్ – అన్బరివ్; కొరియోగ్రఫీ – రాజు సుందరం, బృంద, దినేష్, శ్రీధర్; విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – జులియన్ ట్రౌసెల్లియర్; మేకప్ – క్లోవర్ వూటాన్ మరియు ప్రీతి షీల్.జి.సింగ్; కాస్ట్యూమ్ డిజైన్- దర్శన్ జలన్, ఇషా-దివ్య మరియు నిధి-అనిషా; స్టిల్స్ – ఆర్.వెంకట్రామ్; పబ్లిసిటీ డిజైన్ – రైసింగ్ ఆపిల్, రెడ్ డాట్; పి.ఆర్.ఓ – ఎస్ కె ఎన్ మరియు ఏలూరు శ్రీను; నిర్మాత – సూర్య; రచన – దర్శకత్వం – విక్రం.కె.కుమార్.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  24  Audio release date  teaser  samantha  Nithya menon  stills  

Other Articles