Sardaar Gabbar Singh | Hindi Version Cleared | Pawan Kalyan | Online Ticket Bookings | Videos

Sardaar gabbar singh hindi lines cleared

Sardaar Gabbar Singh Hindi line clear, Sardaar Gabbar Singh Hindi updates, Sardaar Gabbar Singh bookings, Sardaar Gabbar Singh tickets, Sardaar Gabbar Singh online booking, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan

Sardaar Gabbar Singh Hindi lines cleared: Pawan kalyan upcoming film Sardaar Gabbar Singh will be release on 8 April.

‘సర్దార్ గబ్బర్ సింగ్’కు తొలగిన అడ్డంకులు

Posted: 04/05/2016 09:26 AM IST
Sardaar gabbar singh hindi lines cleared

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్ర హిందీ విడుదలకు ఎట్టకేలకు సమస్యలు తొలగిపోయాయి. బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్ర యూనిట్ కు లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తన ‘దబాంగ్2’ చిత్రాన్ని కాపీ కొట్టి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం రూపొందించారని భావించి, లీగల్ నోటీసులు పంపించాడు అర్భాజ్ ఖాన్.

కేస్ ఫైల్ అవడంతో స్ర్కీనింగ్ కమీటీ ఈ సినిమా చూసిందని సమాచారం. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని చూసిన స్ర్కీనింగ్ కమిటీ... ‘దబాంగ్2’కు ‘సర్దార్’కు ఎలాంటి పోలీకలు లేవని కేసును కొట్టిపారేసింది. దీంతో హిందీలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు ఈ సమస్యతో మరింత క్రేజ్ వచ్చినట్లుగా అయ్యింది.

బాహుబలి నుంచి సర్దార్ కు ప్రమోషన్

పవర్ ఫుల్, హై వోల్టేజ్ యాక్షన్, ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని, సెన్సార్ బోర్డ్ నుంచి ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. రాయ్ లక్ష్మీ, సంజనలు కీలక పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటుడు శరత్ కేల్కర్ విలన్ పాత్రలో నటించాడు. మరి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎలాంటి రికార్డుల మోత మోగించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar Singh  hindi line cleared  Pawan kalyan  tickets  posters  

Other Articles