sharad kelkar | Sardaar Gabbar Singh | Pawan kalyan | Baahubali

Sharad kelkar happy with sardaar gabbar singh

sharad kelkar talks about Sardaar Gabbar Singh, sharad kelkar talks about Baahubali, Sardaar Gabbar Singh bookings, Sardaar Gabbar Singh tickets, Sardaar Gabbar Singh online booking, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan

sharad kelkar happy with Sardaar Gabbar Singh: Bollywood actor sharad kelkar telugu film Sardaar Gabbar Singh. sharad kelkar talks about his two south film Baahubali and Sardaar Gabbar Singh.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం బాహుబలి వెయిటింగ్

Posted: 04/04/2016 11:06 AM IST
Sharad kelkar happy with sardaar gabbar singh

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో వున్న టాప్ 5 స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. వీరి సినిమాల పద్ధతులు వేరు అయినప్పటికీ.. ప్రేక్షకుల్లో వీరిద్దరికి భారీ క్రేజ్ వుంది. అలాంటిది ఓ సాధారణ టీవి సీరియల్ నటుడు.. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు.

హిందీలో మొన్నటివరకు ఓ టీవి సీరియల్ నటుడుగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న శరద్ కేల్కర్... ‘బాహుబలి’ చిత్రంతో భారీ క్రేజ్ ను దక్కించుకున్నాడు. ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ చిత్రం హిందీలో కూడా విడుదలయిన విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన బాహుబలి పాత్రకు శరద్ కేల్కర్ తన గొంతుతో ప్రాణం పోసాడు. ఆ పాత్ర అంత అద్భుతంగా రావడానికి శరద్ కేల్కర్ చెప్పిన డైలాగ్ డెలివరీ కూడా కారణమని చెప్పుకోవచ్చు. అప్పుడు కేవలం తన గొంతుతో కాస్త పబ్లిసిటీని దక్కించుకుంటే.. ఈసారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు విలన్ గా మారిపోయాడు.

విడుదలలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కొత్త రికార్డులు

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో శరద్ కేల్కర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం హిందీలో కూడా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో శరద్ కేల్కర్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా హిట్టయితే సౌత్, నార్త్ లో మరిన్ని సినీ ఆఫర్లు రావడం ఖాయమని తెలుస్తోంది.

ఇటీవలే మీడియాతో శరద్ కేల్కర్ మాట్లాడుతూ... 'ఎంతో పెట్టిపుట్టుంటే తప్ప బాహుబలి లాంటి సినిమాలకు పనిచేసే అదృష్టం దొరకదు. చాలా హిందీ సీరియల్స్ లో నా వాయిస్ విన్న కరణ్ జోహార్, బాహుబలి హిందీ వెర్షన్ కు హీరోకు డబ్బింగ్ నువ్వేచెప్పాలన్నప్పుడు సంతోషంగా ఒప్పుకున్నా. సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు నమోదయ్యాయో తెలిసిందే. ఇక బాహుబలి 2 హిందీ డబ్బింగ్ ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తున్నా. దాంతోపాటు నేను తొలిసారిగా వెండితెరపై నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదల కోసం ఎప్పుడెప్పుడా అన్నట్లు ఎదురుచూస్తున్నా. స్క్రీన్ టెస్ట్ కాకముందే పవన్ సార్ నన్ను విలన్ గా ఓకే చేయడం ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది అంటూ భావోద్వేగంగా స్పందించాడు శరద్ కేల్కర్.

తమిళంలోకి ‘సర్దార్’తో పవర్ స్టార్ ఎంట్రీ

ఇక ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఈనెల 8న తెలుగు, హిందీ, తమిళం భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా విడుదలై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనున్నాయో చూడాలి.

 

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar Singh  sharad kelkar  Pawan kalyan  Baahubali  posters  

Other Articles

Today on Telugu Wishesh