Ulavacharu Biryani | Tadka | Prakash Raj | Nana Patekar | Shriya saran

Nana patekar in ulavacharu biryani remake

Ulavacharu Biryani as Tadka, Ulavacharu Biryani remake title Tadka, Ulavacharu Biryani with Nana Patekar, Prakash Raj with Nana Patekar, Shriya in Ulavacharu Biryani remake, Prakash Raj Tadka movie news, Prakash Raj Tadka

Nana Patekar in Ulavacharu Biryani Remake: Prakash Raj Remaking "Ulavacharu Biryani" In Hindi With Nana Patekar. Shriya Saran and Tapsee are also pleased to be part of this movie. Prakash Raj Productions and Zee Studios will jointly produce the movie . Regular shoot will commence from May.

కన్ఫర్మ్: హిందీలో ‘తడ్క’గా వస్తున్న ‘ఉలవచారు బిర్యానీ’

Posted: 04/04/2016 05:42 PM IST
Nana patekar in ulavacharu biryani remake

తెలుగు, తమిళంలో నటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉలవచారు బిర్యాని’. ప్రకాష్ రాజ్, స్నేహ, తేజు, సంయుక్త హర్నాడ్ కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళం భాషలలో విడుదలై, మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు.

హిందీ రీమేక్ వర్షెన్ కు ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రకాష్ రాజ్ పాత్రలో ప్రముఖ జాతీయ ఉత్తమ నటుడు నానా పటేకర్ నటించనున్నారు. హిందీలో ‘తడ్క’ పేరుతో ఈ చిత్రాన్ని ప్రకాష్ రాజ్ పున:నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా మారింది.

ఇందులో శ్రియ, తాప్సీలు ముఖ్య పాత్రలలో నటించనున్నారు. మే, జూన్ నెలల్లో షూటింగ్ కార్యక్రమాలు జరుగనున్నాయని ఈ చిత్ర దర్శకుడు ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. మరి హిందీలో ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

 

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakash Raj  Tadka  Ulavacharu Biryani  Nana Patekar  Shriya saran  

Other Articles