nara rohit latest movie title fixed as tuntari | tollywood news | telugu movie updates

Nara rohit latest film title fixed as tuntari

nara rohit news, nara rohit movies, nara rohit movie updates, nara rohit controversies, nara rohit movie news, nara rohit latest updates, latha hegde news, latha hegde hot photos, latha hegde controversies

nara rohit latest film title fixed as tuntari : nara rohit latest film title fixed as tuntari. the first look released on dussehra festival.

'తుంట‌రి' వేషాలేస్తున్న నారా రోహిత్‌

Posted: 10/22/2015 03:25 PM IST
Nara rohit latest film title fixed as tuntari

వైవిధ్యభరితమైన కథలతో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరో నారా రోహిత్.. ఇప్పుడు ‘తుంటరి’ వేషాలేస్తున్నాడు. ఇది నిజం జీవితంలో కాదులెండి.. రీల్ లైఫ్‌లో! ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రానికి ‘తుంటరి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దసరా రోజున విడుదల చేశారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కథను అందించుకున్నారు. అందుకే.. ఈ మూవీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చిత్రం కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందనే నెపంతో.. నిర్మాతలు సైతం ఏ ఒక్కచోట కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని యూనిట్ బృందం తెలుపుతోంది.

‘గుండెల్లో గోదారి’ ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ సినిమాకు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. అశోక్ బాబా, నాగార్జున్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ సరసన లతా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. సినిమా టాకీపార్టు ఇటీవ‌లే పూర్తయింది. త్వర‌లోనే పాట‌ల‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో నారా రోహిత్ న్యూ లుక్‌తో క‌నిపించనున్నాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి.. ఆ తరహాలోనే రోహిత్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కుతున్నట్టు చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు. ఈ చిత్రం నారా రోహిత్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుందని.. అలాగే లతా హెగ్డేకు నాయికగా ఎదిగేందుకు హెల్ప్ అవుతుందని యూనిట్ అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది. మరి.. రోహిత్ ‘తుంటరి’ వేషాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే!

ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఆర్‌.ప‌ళ‌ని కుమార్‌, మ్యూజిక్: సాయికార్తీక్‌, ఎడిట‌ర్: త‌మ్మిరాజు, ఆర్ట్: ముర‌ళి కొండేటి, స్టంట్స్: వెంక‌ట్‌, కొరియోగ్రఫీ: బాబా భాస్కర్‌, నిర్మాత‌లుః అశోక్ బాబా, నాగార్జున్‌, ద‌ర్శక‌త్వం: కుమార్ నాగేంద్ర‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara rohit  tuntari movi news  latha hegde  

Other Articles