tapsee pannu to romance with young hero sandeep kishan in science fiction movie | tollywood news | telugu movies

Tapsee pannu to romance with sandeep kishan in science fiction movie

tapsee pannu news, tapsee pannu controversies, tapsee pannu news, tapsee pannu update, sundeep kishan movies, sundeep kishan news, tapsee with sundeep kishan

tapsee pannu to romance with sandeep kishan in science fiction movie : tapsee pannu to romance with young hero sandeep kishan in science fiction movie which will go floors soon.

టాలీవుడ్ కుర్ర హీరోతో తాప్సీ రొమాన్స్

Posted: 10/22/2015 02:51 PM IST
Tapsee pannu to romance with sandeep kishan in science fiction movie

చక్కని మేనిఛాయ కలిగిన పంజాబీ డాల్ తాప్సీ పన్ను ఒకప్పుడు తెలుగు తెరపై ఓ ఊపు ఊపేసింది. ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడినప్పటికీ వరుస అవకాశాలు వచ్చాయి. అప్పట్లో స్టార్ హీరోయిన్లను సైతం తలదన్నేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించింది కూడా. కానీ.. కాలక్రమంలో ఈమెకు ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. ఈమె సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో సాధారణంగానే అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో.. తమిళ ఇండస్ట్రీపై దృష్టి సారించింది. అక్కడ సినిమాలు చేస్తూనే.. తెలుగులో అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే.. చాలా ఆలస్యంగా ఈ అమ్మడికి తెలుగులో ఓ ఆఫర్ వచ్చింది. కుర్ర హీరో అయినప్పటికీ అతనితో రొమాన్స్ చేసేందుకు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇంతకీ ఆ కుర్ర హీరో ఎవరు? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న సందీప్ కిషన్. ఇప్పటివరకు కామెడీ సినిమాలు చేసుకుంటూ ఎంటర్టైనింగ్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సందీప్.. ఇప్పుడు ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణాన్ని చిత్రబృందం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కథానాయికగా తాప్సీని తీసుకున్నట్లు సమాచారం. ఇక తెలుగులో రాకరాక వచ్చిన ఈ అవకాశాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాప్సీ వెంటనే ఒప్పేసుకుంది. ఈ సినిమాతో తనకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశతో అమ్మడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి.. ఈ సినిమాతోనైనా తాప్సీకి మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో వేచి చూడాల్సిందే!

ఇదిలావుండగా.. సాధారణంగా సందీప్ సినిమాలంటేనే అందులో కాస్తోకూస్తో రొమాన్స్ కచ్చితంగా వుంటుంది. ఇక లిప్‌లాక్ సన్నివేశాలైతే అతని ప్రతి సినిమాలోనూ వున్నాయి. ఇప్పుడు తాజాగా నటించబోయే సైన్స్ ఫిక్షన్ సినిమాలో కూడా తాప్సీ, సందీప్‌ల మధ్య రొమాన్స్ సన్నివేశాలు ఘాటుగానే వుండే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. మరి.. ఆ వివరాలు తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tapsee pannu  sundeep kishan  telugu science fiction movies  

Other Articles