Nannaku Prematho Movie Teaser rocking

Nannaku prematho movie teaser rocking

NTR, Jn NTR, Nannaku Prematho, New look in Nannaku Prematho, NTRs Nannaku Prematho, NTR UPdates, NTR News, Jn NTR News, Nannaku Prematho movie, Nannaku Prematho teaser, Nannaku Prematho songs, Nannaku Prematho posters, Nannaku Prematho stills, Nannaku Prematho motion picture

The teaser of Junior NTR's upcoming movie "Nannaku Prematho", which was released as Dussehra treat for Nandamuri fans, has got good response from the audience, who are impressed with his look.

దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ కొత్త సినిమా టీజర్

Posted: 10/23/2015 11:18 AM IST
Nannaku prematho movie teaser rocking

జూనియర్ ఎన్టీఆర్.. టెంపర్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న నాన్నకు ప్రేమతో సినిమా కొత్త లుక్స్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే క్రేజ్ ను మరింత పెంచుకున్నారు. స్టైలిష్ లుక్ తో.. అదిరిపోయే బాడీ ల్యాంగ్వేజ్ తో ముందు కన్నా స్మార్ట్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు ఎన్టీఆర్. టెంపర్ సినిమాతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ప్రాజెక్టు తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను దసరా కానుకగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎన్టీఆర్, రకుల్ ప్రీత్‌సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో.. టీజర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. నిన్న సాయంత్రం విడుదల చేసిన టీజర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎన్టీఆర్ కొత్తగా కన్పిస్తుండటంతో ఇన్ స్టంట్‌గా జనాలకు ఎక్కేసింది. గడిచిన 12 గంటల్లో 5 లక్షల హిట్స్ వచ్చాయి. 24 గంటలు గడిచేలోపు మిలియన్ మార్కు అందుకుంది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో టీజర్ ఇంటర్నెట్ లో దుమ్మురేపుతూ.. ఎన్టీఆర్ ఖలేజాను చాటుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles