humongous price for baahubali satellite rights

Huge deal for baahubali from sony f or satellite rights

baahubali satellite rights price, bahubali satellite news, baahubali latest news, bahubali movie satellite news, bahubali cinema satellite, bahubali Tv rights, sony tv

The movie is touted to have made a huge pre-release business but now news regarding the Satellite rights of Baahubali Hindi version is the hot topic in the cine circles

బాహు బాహు.. బాహుబలి.. శాలిటైల్ రైట్స్ కూడా రికార్డే..!

Posted: 07/12/2015 06:53 PM IST
Huge deal for baahubali from sony f or satellite rights

బాహుబలి అన్ని చోట్లా రికార్డులు మోతను మోగిస్తుంది. సినిమా రూపుదిద్దుకోవడం ఒక రికార్డయితే.. విడుదలైన తరువాత ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ సహా కాలీవుడ్, శాండిల్ వుడ్ సహా విదేశాలలోనూ రికార్డు కలెక్షన్లు రాబడుతున్న జక్కన ప్రభాస్ ల బాహుబలి అటు శాటిలైట్ రైట్స్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయన్న టాక్ బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారాయి. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బాహుబలి.. మొదటి రోజు వేసిన ప్రీమియర్ షోస్ నుంచే బాహుబలి సరికొత్త రికార్డ్స్ కి శ్రీకారం చుట్టింది. సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కల స్టార్డం కూడా తోడవడంతో బాహుబలి మూవీ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ లలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో పాటు సెన్సేషనల్ కలెక్షన్స్ సాదిస్తుండడంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి ఎనలేని డిమాండ్ నెలకొంది. ఇప్పటికే బాహుబలి హిందీ శాటిలైట్ రైట్స్ ని సోనీ పిక్స్ వారు 17 కోట్లకి సొంతం చేసుకున్నారని ఇది వరకే తెలియజేశాం. ఇదే విధంగా తెలుగులో కూడా టాప్ ఛానల్స్ అన్నీ బాహుబలి శాటిలైట్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. ఈ పోటీలో చివరికి జీ తెలుగు వారు 16 కోట్లకి పైగా ఖర్చు పెట్టి బాహుబలి తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమా శాటిలైట్ రికార్డ్స్ ఇంత్త రేటుకి అమ్ముడు పోవడం ఇదే ప్రధమం కావడంతో బాహుబలి శాటిలైట్ రేట్స్ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసింది. మరోవైపు తమిళంలో కూడా శాటిలైట్ రైట్స్ విషయంలో పోటీ జరుగుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baahubali  satellite rights  SONY TV  

Other Articles