పెట్రోలు ధరలు సామాన్యులనే కాదు సంపన్నులను ఇబ్బంది పెడుతున్నాయి. రెండేళ్లలో లీటరు పెట్రోలు ధర రమారమి రూ.50 వంతున పెరిగింది. దీంతో పెట్రోలు వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు జనాలు మళ్లుతున్నారు. ఈ తరుణంలో మరో ఐడియాతో వచ్చింది హోండా మోటర్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సంస్థ. పెట్రోలుతో పాటు ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్ ఇంజన్‌ను ఉపయోగిస్తూ బైక్‌ను ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నట్టు హోండా ప్రకటించింది.
హోండా త్వరలోనే మార్కెట్లోకి తీసుకువచ్చే ఫ్లెక్స్ ఇంజన్ స్కూటర్ ఇటు పెట్రోలుతో పాటు అటు ఇథనాల్ ఇంధనంతో కూడా నడుస్తుంది. హోండా సంస్థ 2009లోనే టైటాన్ సీజీ ఫ్లెక్స్ పేరుతో ఓ బైకు విదేశీ మార్కెట్లో రిలీజ్ చేసింది. అయితే అప్పుడు పెట్రోలు ధరలు అదుపులోనే ఉండటంతో అంతగా క్లిక్ కాలేదు. ఇండియాలో సాగు రంగంలో చెరుకు బాగా ఉత్పత్తి అవుతోంది. చెరుకు పంట నుంచి బై ప్రోడక్టుగా భారీ ఎత్తున ఇథనాల్ తయారు చేసే అవకాశం ఉంది. దీంతో ఇటు రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు పెట్రోలు నుంచి ఉపశమనం కలిగనుంది.
దీంతో ఫ్లెక్స్ ఇంజన్లతో కూడిన వాహనాలు తయారు చేయాలంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఇప్పటికే అనేక సంస్థలకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే టీవీఎస్ సంస్థ ఫ్లెక్స్ ఇంజన్‌తో అపాచీ ఆర్టీఆర్ 200 ఎఫ్ఐ ఈ100 బైకును మార్కెట్లోకి తెచ్చింది. ఆ తర్వాత హోండా సంస్థ నుంచి మరో బైక్ మార్కెట్లోకి రాబోతుంది. లీటరు పెట్రోలు ధరతో పోల్చినప్పుడు సగం ధరకే ఇథనాల్ లభిస్తుంది. అంతేకాక రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
May 28 | భారత్‌లో వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 10 శాతానికి పైగా పెంచుకోవాలని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ `బీఎండబ్ల్యూ` లక్ష్యంగా పెట్టుకున్నది. ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్ ఐ4ను భారత్‌లో ఆవిష్కరించింది. వాహనాల... Read more
Apr 27 | నోకియా ఫోన్ల తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా నోకియా జీ 21 ('Nokia G21') పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్... Read more
Mar 31 | ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో తాజాగా ఆధునీకరించిన కాంపాక్ట్ ఎస్యూవీ కైగర్‌ను విడుదల చేసింది. పరికొత్త ఫీచర్స్ తో వచ్చిన కైగర్ లుక్ కూడా ఆకట్టుకుంటోంది. డబ్బుకు సైరన విలువతోపాటు అధునాతన ఫీచర్లు... Read more
Mar 07 | ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మోరిస్ గ్యారేజీస్(ఎంజీ) మోటార్స్ నేడు తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్యువీ) 'జెడ్ఎస్ ఈవీ' అప్డేట్ వెర్షన్ కారును భారతదేశంలో లాంఛ్ చేసింది. ఎంట్రీ లెవల్ ఎక్స్ ప్లోజ్... Read more
Mar 04 | దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కూడా పర్యావరణ హితమైన ఈవీ వాహనాల తయారీలో నిమగ్నమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థ తన భవిష్యత్తు ఎలక్ట్రిక్, కొత్త జనరేషన్... Read more