Coffee Day appoints VG Siddhartha's wife as CEO 'కేఫ్‌ కాఫీ డే' సీఈవోగా సిద్ధార్థ సతీమణి మాళవిక

Coffee day appoints late founder v g siddharthas wife as ceo

Coffee day enterprise, Shriram Ownership Trust, Salarpuria Sattva Group, SM Krishna, VG Siddhartha, Coffee Day Enterprises, Malavika Hegde, Vasudhara, Bengaluru, Giri Devanur, Mohan Raghavendra Kondi, Siddhartha, commerce, business, economy

Coffee Day Enterpriseshas appointed founder and former chairman VG Siddhartha's wife Malavika Hegde as its chief executive officer. 'Malavika Hegde, Director of the Company, has been appointed as Chief Executive Officer of the Company,' said the company in a BSE filing.

కేఫ్‌ కాఫీ డే సంస్థ పగ్గాలు.. సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే చేతికి..

Posted: 12/09/2020 01:07 PM IST
Coffee day appoints late founder v g siddharthas wife as ceo

కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత ఏడాది కేఫ్ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ సంస్థ వ్యవస్థాపకుడు వీజి సిర్థార్థ.. నదిపై వున్న వంతెన వద్ద కారు నిలిపి తన డ్రైవరును వెనక్కు పంపించి.. ఆకస్మాత్తుగా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన ఆత్మహత్యకు తాను తీసుకున్న రుణాలే కారణమని.. ఆర్థికంగా కొంత ఒత్తిడిలో వున్న ఆయనను.. అప్పులు చెల్లించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఒత్తిడి తట్టుకోలేక ఆయన నదిలో దూకి మరణించాడని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.

కాగా, ఈ కేప్ కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ సంస్థలో తాను ఒక డైరెక్టర్ గా వున్నా.. తన భర్త చూసుకుంటున్న నేపథ్యంలో పెద్దగా పట్టించుకోని ఆయన సతీమణి మాళవిక హెగ్డే.. తాజాగా కాఫీ డే సంస్థ నూతన సీఈవో పగ్గాలను అందుకున్నారు. ఈ మేరకు ఆ సంస్థ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కుమార్తె అయిన మాళవిక.. అప్పుల్లో ఉన్న కాఫీడే సంస్థను తిరిగి నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు గతంలో చెప్పారు. సీఈవోతో పాటు అదనపు డైరెక్టర్లుగా సీహెచ్‌ వసుంధరా దేవీ, గిరి దేవనూర్‌, మోహన్‌ రాఘవేంద్రను సంస్థ బోర్డు నియమించింది.

నూతన సీఈవో (కార్య నిర్వాహక అధికారి)తో పాటుగా అదనపు డైరెక్టర్లు అందరూ 2025 వరకు ఆయా పదవుల్లో కొనసాగుతారని బోర్డు వెల్లడించింది. కాఫీడే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ మరణించిన తర్వాత కాఫీ డే సంస్థకు ఇండిపెండెంట్‌ బోర్డు సభ్యుడైన ఎస్వీ రంగనాథ్‌ మధ్యంతర ఛైర్మన్‌గా వ్యవహరించారు. బెంగళూరుకు చెందిన కేఫ్‌ కాఫీ డే దేశవ్యాప్తంగా వందలాది కాఫీ షాప్‌లను నిర్వహిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malavika Hegde  Coffee Day Enterprises  SM Krishna  VG Siddhartha  Bengaluru  commerce  business  economy  

Other Articles