Gold prices fall for 4th day, plunge ₹2,50 this week అంతర్జాతీయంగా దిగివస్తున్న బంగారం ధరలు..

Gold rate today slips further near rs 49000 mark on weak global trend

gold rate today, HDFC Securities, Gold, mcx, Bullion market, silver, federal reserve, gold price today, SPDR Gold Trust, United States dollar

Gold and silver slid further in today's early trade following the trend in the international market as the metals broke string support levels amid strengthening US dollar. The dollar index held firm near a more than eight-week peak against rival currencies.

అంతర్జాతీయంగా దిగివస్తున్న బంగారం ధరలు.. రూ. యాభై వేల దిగువకు..

Posted: 09/25/2020 10:08 AM IST
Gold rate today slips further near rs 49000 mark on weak global trend

అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగివస్తున్నాయి, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల బంగారం ధర చాలా రోజుల తరువాత రూ. 50 వేల దిగువకు వచ్చింది. అమెరికా డాలర్ బలపడుతూ రావడం, ఆరు వారాల గరిష్ఠానికి డాలర్ చేరడంతోనే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ వారంలో వరుసగా నాలుగు రోజులుగా పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2500 మేర తగ్గింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో 0.3శాతం మేర తగ్గిన ఔన్సు బంగారం ధరల 1858 డాలర్లకు జారింది, ఇక క్రితం రోజున తన దారి వేరని పెరిగిన వెండి కూడా ఇవాళ పడిపోయింది, అంతర్జాయంగా 2.8శాతం మేర ధర కుదించుకుపోయిన ఔన్సు వెండి ధర 22.23 డాలర్లకు చేరింది.

ఎంసీఎక్స్ లో అక్టోబర్ ఫ్యూచర్స్ బంగారం ధర ఇవాళ. 405 తగ్గి రూ. 49,293కు చేరుకుంది. ఇదే సమయంలో డిసెంబర్ ఫ్యూచర్స్ కు సంబంధించి, వెండి ధర కిలోకు రూ. 1,890 పడిపోయి రూ. 59,323కు చేరుకుంది.  ఇక స్పాట్ మార్కెట్లో ఓ దశలో వెండి ధర రూ. 56,710 వరకూ దిగజారింది, ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1.9 శాతం పడిపోయి రూ. 950 మేర తగ్గగా, మరోవైపపు వెండి ధర 4.5 శాతం పతనమై కిలోకు రూ. 2700 మేర దిగజారింది. ఇటు దేశీయంగా కూడా బంగారానికి డిమాండ్ పెద్దగా లేకపోవడంతో బంగారం విక్రయాలు పెద్దగా సాగడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles