ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్ డౌన్ చేసేసింది. ఇక మూడు నుంచి నాలుగు నెలలే మూసినా.. మళ్లీ వాణిజ్యం గాడిన పడటానికి నెలలు గడుస్తున్నాయి. ఇలా ఈ ఏడాది హరి హరి అంటూ వెళ్లిపోగా, నూతన ఏడాది కోవిడ్ కు టీకాను ప్రపంచ ప్రజలకు అందించేందుకు రంగం సిద్దం చేసుకోగా.. ఇక అంతలోనే వాణిజ్యాన్ని గాడిన పెట్టేందుకు వెట్ గ్రైండర్ మొదలుకుని ఓవెన్, వాషింగ్ మెషీన్, ఏసీ, ఫ్రిడ్జిల నుంచి కార్ల వరకు అన్నింటి ధరలను పెంచుతున్నట్లు రాకముందే భయపెడుతోంది.
ఎలక్ట్రానిక్ కన్జూమర్ గూడ్స్ మొదలుకుని అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులపై ధరల ప్రభావం వుంటుందని ఇప్పటికే ఆయా కంపెనీలు ప్రకటించాయి. అందుకు తాము వినియోగించే ముడిసరుకుల వస్తువుల ధరలు గణనీయంగా పెరగడటమే ఇందుకు కారణంగా పెర్కోన్నాయి. ఇక ధరాఘాత ప్రభావం ఒకింత రియల్ ఎస్టేట్ రంగంపై కూడా పడింది. మరీ ముఖ్యంగా ఉక్కు, కంకర, సిమెంట్ ధరలు కూడా పెరిగాయి. ఇదే సమయంలో అటు కార్ల కంపెనీలు కూడా ధరల మోత తప్పదని.. 2021 నుంచి కొత్త కార్లను కోనుగోలు చేసేవారిని అప్రమత్తం చేసింది. తమ కార్ల తయారీలో వినియోగించే ఉక్కుతో పాటు ప్లాస్టిక్, ఇతర నిర్మాణ వ్యయాలు పెరగడంతో ధరల పెంపు అనివార్యమైయిందని ప్రకటించాయి.
ఇప్పటికే మహీంద్రా, రెనో, హీరో మోటోకార్ప్, మారుతిసుజుకి, ఫోర్డ్ వంటి వాహన తయారీ సంస్థలు జనవరి 1 నుంచి తమ వాహన మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇప్పుడు బీఎండబ్ల్యూ, టాటా మోటార్స్, ఇసుజు సంస్థలు కూడా వాణిజ్యపరమైన వాహనాల ధరలు పెంచాలని నిర్ణయించుకున్నాయి. ఉత్పత్తి వ్యయం అధికం కావడమే కాకుండా, బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు తయారు చేయాల్సిరావడం ఆర్థికంగా ప్రయాసభరితమని టాటా మోటార్స్ వెల్లడించింది. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ జనవరి 4 నుంచి ధరలు పెంచేందుకు సిద్ధమైంది. బీఎండబ్ల్యూతో పాటు అనుబంధ బ్రాండ్లపై 2 శాతం పెంపు ఉంటుందని తెలిపింది. పికప్ వాహనాలకు పెట్టింది పేరైన ఇసుజు సంస్థ మోడళ్లను బట్టి రూ.10 వేల మేర ధరల పెంచాలని నిర్ణయించింది. ఇసుజు ధరల పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more
Jul 15 | రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్... Read more