Techo Electra Motors launches e-moped Saathi దేశీయ విపణిలోకి టెక్నో ఎలెక్ట్రా ఇ-మోపెడ్‌ 'సాథీ'

Techo electra motors launches e moped saathi in domestic market

Techo Electra Motors, electric two-wheeler, e-moped Saathi, Saathi, e-commerce, Chakan, Pune, Prakash Bhootra, managing director, technology

Pune-based electric two-wheeler start-up Techo Electra Motors launched its new e-moped 'Saathi', priced at Rs 57,697 (on-road Pune). The delivery of the e-moped, which targets the fast growing e-commerce segment, is expected to begin from October, the company said in a release.

దేశీయ విపణిలోకి టెక్నో ఎలెక్ట్రా ఇ-మోపెడ్‌ ‘సాథీ’,, అక్టోబర్ నుంచే సెల్స్..

Posted: 08/22/2020 01:25 AM IST
Techo electra motors launches e moped saathi in domestic market

దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్‌ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.57,697 (ఆన్‌- రోడ్‌ పుణె). సాథీ డెలివరీలను అక్టోబరు రెండో వారం నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. 48-వోల్ట్‌ 26ఏహెచ్‌ లిథియం-ఐయాన్‌ బ్యాటరీ కలిగిన ఈ మోపెడ్‌ ఒక్కసారి ఛార్జింగ్‌తో 60- 70 కి.మీ మైలేజీని అందిస్తుంది.

ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్‌ చేయడానికి 3-4 గంటల సమయం పడుతుంది. పుణెలోని చకన్‌ ప్లాంట్‌లో దీన్ని తయారు చేయనున్నారు. వేగంగా విస్తరిస్తున్న ఈ కామర్స్ వ్యాపార సెగ్మెంట్ ను టార్గెట్ గా చేసుకుని టెక్నో ఎలక్ట్రా తమ ద్విచక్ర వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సందర్బంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ భూట్రా మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లు అందుబాటులో వున్న అన్ని రకాల ద్విచక్రవాహనాల ధరలకు దూరంగా కస్టమర్లకు అందుబాటు ధరలో తమ వాహనాలు వుంటాయని చెప్పారు, ఇక బ్యాటరీ లైప్ పరంగాను అధికంగా మన్నుతుందని దీంతో కస్టమర్లు తమ విలువైన డబ్బును కూడా ఆదా చేసుకుంటారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles