Reliance JioMart gets new features జియో మార్టుతో రీటైల్ రంగంలోకి రిలయన్స్..

Jio mart and whatsapp will create growth opportunity for kiranas says mukesh ambani

Reliance Jio, JioMart, JioMart features, Reliance, WhatsApp, kirana shop, Mukesh Ambani, ril agm, reliance agm, Business, E-commerce

In the 43rd annual general meeting of Reliance Industries Limited (RIL), Mukesh Ambani emphasised that JioMart, Reliance Industries' (RIL) platform for customers and kirana stores, and WhatsApp will work together to create more growth opportunities for kirana stores in India.

జియో మార్టుతో రీటైల్.. జియో టీవీ ప్లస్ తో టీవీ రంగంలోకి రిలయన్స్:

Posted: 07/15/2020 09:44 PM IST
Jio mart and whatsapp will create growth opportunity for kiranas says mukesh ambani

రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ముంబైలో జరిగిన 43వ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన కుటుంబసభ్యులు, వ్యాపార భాగస్వాములు, షేర్ హోల్డర్లు హాజరయ్యారైన ఈ సమావేశ:లో ఆయన రిలయన్స్ తీసుకువచ్చే అదునాతన సాంకేతికతతో కూడిన పరికరాలను తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా, కుమారుడు ఆకాశ్ అంబానీలు వీటికి సంబంధించిన వివరాలను వివరించారు.  

జియో గ్లాస్ లో రియాలిటీ హెడ్ సెట్ ఉంటుంది. దీని ద్వారా వర్చువల్ ఇమేజెస్ ను చూడవచ్చు. దీని బరువు 75 గ్రాములు ఉంటుంది. సింగిల్ కేబుల్ కనెక్షన్ ఉంటుంది. దీని ద్వారా మొబైల్ కు కనెక్ట్ కావచ్చు. ఇప్పటికే 25 యాప్స్ ను ఇందులో ఇన్స్టాల్ చేసినట్టు తెలిపారు. వీడియో మీటింగ్స్ కు కూడా ఈ గ్లాసులు అనువుగా ఉంటాయి. విద్యార్థులకు కూడా అ గ్లాసులు చాలా ఉపకరిస్తాయి. చారిత్రక ప్రదేశాలతో పాటు వివిధ అంశాలను వర్చువల్ గా చూస్తూ పాఠాలను నేర్చుకోవచ్చు. త్రీడీని కూడా ఈ గ్లాస్ సపోర్ట్ చేస్తుంది. జియో టీవీ ప్లస్ ను కూడా ప్రారంభిస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది.

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ తదితర పలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఇందులో ఉన్నాయి. వాయిస్ సర్చ్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. వినియోగదారులకు ఇంటి వద్దకే నాణ్యమైన సరుకులను అందజేయడానికి జియోమార్ట్ ను తీసుకొస్తున్నట్టు ఈషా అంబానీ తెలిపారు. కస్టమర్లు, కిరాణా షాపు యజమానులు, ఉత్పత్తిదారులను అనుసంధానం చేయడం... రిలయన్స్ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ను నలుమూలలకు తీసుకెళ్లడం అనే రెండు పిల్లర్ల ఆధారంగా జియో మార్ట్ పని చేస్తుందని చెప్పారు. జియో మార్ట్ ద్వారా తొలి ఆర్డర్ చేసిన వారికి మాస్కులు, శానిటైజర్లను ఉచితంగా ఇస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles