షావోమి నుంచి విడిపోయిన పోకో తన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వేగవంతమైన ప్రాసెసర్ తో ఆకట్టుకున్న పోకో ఎక్స్ 1 తరువాత, ఈ సిరీస్‌లో రెండవ స్మార్ట్ ఫోన్ ను పోకో ఎక్స్ 2 పేరుతో తీసుకొచ్చింది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న పోకో ఎక్స్ 2 బేస్ వేరియంట్ రూ రూ.15,999 గా ఉంచింది. అలాగే ఎయిర్ టెల్ లేదా జియో నెట్ వర్క్ లో వై ఫై కాలింగ్ సదుపాయాన్ని కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో అందిస్తోంది. పోకో ఎక్స్ 2 అట్లాంటిక్ బ్లూ, మ్యాట్రిక్స్ పర్పుల్ , ఫీనిక్స్ రెడ్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.
పోకో ఎక్స్ 2 ఫీచర్లు:-
6.67 అంగుళాల డిస్ప్లే
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్
1080x2380 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 10
64+8+2+2 ఎంపీ రియర్ ఎమెరా
20 +2 ఎంపీ ఎంపీ సెల్ఫీ కెమెరా
4500 ఎంఏహెచ్‌బ్యాటరీ
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లే, క్విడ్ కూలింగ్, యుఎస్బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 27 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 960 ఎఫ్‌పీఎస్‌లో స్లో-మోషన్ వీడియోలను రికార్డింగ్ ఇతర ప్రధానపీచర్లుగా ఉన్నాయి.
ధరలు :
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ .15,999
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ .16,999
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ టాప్ ఎండ్ వేరియంట్ రూ .19,999
పోకో ఎక్స్ 2 ఫిబ్రవరి 11 మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్ కొనుగోలుపై అదనంగా రూ .1000 మినహాయింపు పొందవచ్చు.
(And get your daily news straight to your inbox)
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more
Jul 15 | రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్... Read more