Fitch slashes India's GDP growth forecast to 1.8% భారతీ తగ్గనున్న భారత్ జీడీపీ వృద్ది రేటు: ఫిచ్ సోల్యూషన్స్

Covid 19 impact fitch solutions slashes india s gdp forecast to 1 8 per cent

Coivd-19, coronavirus outbreak, Coronavirus, India’s GDP, India GDP growth. India GDP forecast. Fitch Solutions, Indian Economy, business

Fitch Solutions has cut India’s GDP growth forecast for FY21 to 1.8 per cent from 4.6 per cent earlier due to contraction in private consumption following the novel coronavirus (COVID-19) outbreak.

భారతీ తగ్గనున్న భారత్ జీడీపీ వృద్ది రేటు: ఫిచ్ సోల్యూషన్స్

Posted: 04/20/2020 06:11 PM IST
Covid 19 impact fitch solutions slashes india s gdp forecast to 1 8 per cent

నోవల్ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాల అర్థిక వ్యవస్థల పయనించే దారిలోనే భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా పయనిస్తోంది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) బాటలోనే ఫిచ్‌ సొల్యూషన్స్‌ సైతం భారత వృద్ధి రేటు అంచనాలను భారీగా కుదించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 1.8శాతం ఉండనుందని అంచనా వేసింది. కొవిడ్‌-19 ప్రభావంతో ప్రజల ఆదాయాలు పడిపోవడంతో ప్రైవేటు వివిమయం భారీగా తగ్గిపోయిందని తెలిపింది. ఈ నేపథ్యంలో జీడీపీ అంచనాల్లో కోత విధించాల్సి వచ్చిందని వివరించింది.

దేశ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి నెలకొన్న నేపథ్యలో కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా మూల పెట్టుబడుల్లో కోత విధించుకునే అవకాశం ఉందని అభిప్రాయడింది. అందులో భాగంగా స్థిర పెట్టుబడులు భారీ స్థాయిలో తగ్గొచ్చని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలు నెమ్మదిగా అమలు చేయడం వల్ల దేశ ఆర్థిక కష్టాలు మరింత పెరిగిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో ప్రైవేట్‌ వినిమయం, కంపెనీల స్థిర పెట్టుబడులు భారీ స్థాయిలో పడిపోతాయని అంచనా వేసింది. ప్రభుత్వ వినిమయమే 2020లో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుందని అభిప్రాయపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles