India's growth rate to slip down further: ICRA రెండో క్వార్టర్ లో మరింత దిగజారనున్న దేశ వృద్ది రేటు..

India s growth rate to slip down further in q2fy20 to 4 7 icra

Economy, Growth rate, Growth slowdown, Growth decline India, India's growth rate, Finance year 2020, Financial year 2020, Financial year 2020 growth slowdown, business

India's growth rate can further slow down to 4.7 per cent in Q2 FY2020 due to weak industrial output, rating agency ICRA has predicted.

రెండో క్వార్టర్ లో మరింత దిగజారనున్న దేశ వృద్ది రేటు..

Posted: 11/22/2019 03:32 PM IST
India s growth rate to slip down further in q2fy20 to 4 7 icra

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు తగ్గుముఖం పట్టినప్పటికీ భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు దూసుకుపోతోందని.. ప్రస్తుతత దేశ స్థూల జాతీయ దేశీయోత్పత్తి వృద్ధి రేటు 3.2శాతంగా నమోదైందని, ఇది మన దేశాన్ని అగ్రస్థానంలో నిలిపిందని.. బీజేపి నేతలు గత త్రైమాసిక ఫలితాలు విడుదలైన క్రమంలో చేసిన వ్యాఖ్యలు. అయితే ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనూ దేశీయ స్థూల జాతీయోత్పత్తి రేటు మందగిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.

తొలి త్రైమాసికంలో నమోదైన గణంకాలకంటే ఈ సారి మరింత దిగజారుతాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ జోస్యం చెప్పింది. 2020 ఆర్థిక సంవత్సరంలోని (జూలై-సెప్టెంబర్) మధ్యకాలంలోని రెండో త్రైమాసికంలోనూ భారత స్థూల జాతీయెత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోతుందని అంచనా వేసింది. మందగమనంలో సాగుతున్న పారిశ్రామిక ఉత్పత్తి ఇందుకు కారణంగా మారనుందని తెలిపింది. గత క్వార్టర్ లో నమోదైన వృద్ది రేటు ఈ సారి మరింతగా పడిపోనుందని అంచనా వేసింది.

ఈ ఏడాది జూలై, సెప్టెంబర్ మధ్య కాలంలో జీడీపీ వృద్ధి రేటు కేవలం 4.7 శాతంగా నమోదైన కానుందని అంచనా వేసింది. అంత క్రితం త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతంగా నమోదైంది. ఇదిలావుంటే స్థూల విలువ అధారిత ప్రగతి కూడా మరింతగా దిగజారిపోయిందని, గత త్రైమాసికంలో 4.7గా నమోదైన ఈ గణంకాలు ఈ త్రైమాసికానికి 4.5కు పడిపోతాయని అంచనా వేసింది. అయితే గత త్రైమాసికంలో గణంకాలు కాసింత మెరుగ్గా నమోదుకావడానికి వ్యవసాయ ఆధారిత, సేవా రంగాలు బాలెన్స్ చేశాయని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles