Bullion traders cautious ahead of Fed rate decision పసిడి పరుగుకు బ్రేక్.. ఒక్కరోజు రూ.2వేలు తగ్గిన ధర

Gold prices fall for second today down rs 2000 from highs silver declines

gold price today, gold price in India today, gold latest price, silver price today, silver latest price, gold silver price today, mcx gold price, mcx silver price, gold price per gram

Gold prices declined today for the second day in Indian markets as a pullback in global oil prices took some edge off safe-haven assets. On MCX, October gold futures prices were down 0.25% to Rs.37,920 per 10 gram.

పసిడి పరుగుకు బ్రేక్.. ఒక్కరోజు రూ.2వేలు తగ్గిన ధర

Posted: 09/18/2019 06:59 PM IST
Gold prices fall for second today down rs 2000 from highs silver declines

పసిడి పరుగుకు ఇవాళ అడ్డుకట్ట పడింది. నిన్న భారీగా పెరిగిన ధరలు ఇవాళ ఒక్కసారిగా దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన కారణంగా బంగారం వెండి ధరలు కిందకు దిగివచ్చాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో బుధవారం అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.25 శాతం తగ్గుదలతో రూ.37,920కు క్షీణించింది. ఈ నెల ప్రారంభంలోని బంగారం గరిష్ట స్థాయి రూ.39,885తో పోలిస్తే ఇప్పుడు పసిడి ధర ఏకంగా రూ.2,000 పడిపోయింది.

పసిడి బాటలోనే పేదల ఆభరణంగా వర్థిల్లుతున్న వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.6 శాతం తగ్గుదలతో రూ.47,075కు క్షీణించింది. వెండి ధర ఈ నెల ప్రారంభంలో రూ.51,489 గరిష్ట స్థాయిని తాకిన విషయం తెలిసిందే. దీంతో పోలిస్తే వెండి ధర ఏకంగా రూ.4,400 పతనమైంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. పసిడి ధర ఔన్స్‌కు 1,500 డాలర్లకు పైనే కదలాడుతోంది.

అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్ల ప్రకటన కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. ఈ రోజు అమెరికా ఫెడ్ పాలసీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించొచ్చనే అంచనాలున్నాయి. ఇక అదేసమయంలో వెండి ధర ఔన్స్‌‌కు 0.4 శాతం క్షీణతతో 17.93 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సెప్టెంబర్ నెల ప్రారంభంలో బంగారం ధర ఆరేళ్ల గరిష్ట స్థాయిని తాకాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు వంటి పలు అంశాలు ఇందుకు కారణంగా నిలిచాయి.

ధరల పెరుగుదలతో దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గింది. ఆగస్ట్ నెలలో బంగారం దిగుమతులు ఏకంగా 60 శాతానికి పైగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 తగ్గుదలతో రూ.39,500కు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా కేవలం రూ.10 తగ్గుదలతో రూ.36,250కు క్షీణించింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.35 తగ్గుదలతో రూ.48,765కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ తగ్గడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,100 వద్ద స్థిరంగా కొనసాగింది. అదేబాటలో 22 క్యారెట్ల పసిడి ధర కొనసాగింది. ఇకపోతే కేజీ వెండి ధర మాత్రం తగ్గింది. రూ.35 తగ్గుదలతో రూ.48,765 పడిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold  silver  gold price  silver price  22 carat  24 carat  precious metals  Bullion traders  business news  

Other Articles