బలహీనమైన అంతర్జాతీయ ట్రెండ్ కారణంగా దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 1 శాతం పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర రూ.38,527కు దిగొచ్చింది. గతవారంలో బంగారం ధర రూ.39,885కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అక్కడి నుంచి చూస్తూ ఇప్పుడు బంగారం ధర రూ.1,000 మేర పడిపోయింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి.
ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ ధర 3 శాతం క్షీణతతో రూ.48,065కు పడిపోయింది. ఇటీవలి గరిష్ట స్థాయి రూ.51,489తో పోలిస్తే వెండి ధర ఏకంగా రూ,3,500 పడిపోయింది. ఇండియన్ రూపాయి రికవరీ చెందడం, గ్లోబల్ మార్కెట్లో రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడటం వంటి అంశాలు ఇందుకు కారణం. ఇకపోతే ఢిల్లీలోని స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.372 క్షీణతతో రూ.39,278కు దిగొచ్చింది. ఇకపోతే గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు పడిపోతూనే వస్తున్నాయి.
శుక్రవారం పసిడి ధర ఔన్స్‌కు 0.77 శాతం తగ్గుదలతో 1,513.95 డాలర్ల వద్ద కదలాడుతోంది. వెండి ధర కూడా ఔన్స్‌కు ఏకంగా 3.03 శాతం క్షీణతతో 18.23 డాలర్లకు క్షీణించింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక గణంకాల కారణంగా గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడిందని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. దీంతో బంగారం, వెండి ధరలపై ఒత్తిడి నెలకొందని తెలిపింది. అలాగే బంగారం, వెండి ధరలపై లాభాల స్వీకరణ కూడా ప్రతికూల ప్రభావం చూపిందని వివరించింది.
(And get your daily news straight to your inbox)
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more
Jul 15 | రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్... Read more