PNB Scam Case : ICICI CEO and Axid MD Summoned | పీఎన్బీ స్కామ్ ఎఫెక్ట్.. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ హెడ్ లకు సమన్లు

Pnb scam notices

PNB Scam Case, ICICI Bank, Chanda Kocchar, Axis Bank, Shikha Sharma, SFIO,

Serious Fraud Investigation Office (SFIO) today summoned ICICI Bank chief Chanda Kocchar and Axis Bank's Shikha Sharma for interrogation in the mega Punjab National Bank (PNB) scam case. Both the top women bankers have been summoned in a case of Rs 5280 crore working capital facility given to Mehul Choksi's Gitanjali Group by a consortium of 31 banks. The ICICI Bank, with a loan of Rs 405 crore, was a lead banker in this consortium; Axis Bank had a major exposure too.

ఐసీఐసీఐ చైర్మన్, యాక్సిస్ ఎండీలకు నోటీసులు

Posted: 03/06/2018 11:09 AM IST
Pnb scam notices

భారత దేశ బ్యాంకింగ్ రంగ పరువును తీసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, నీరవ్ మోదీ వ్యవహారంలో ఈ ఉదయం భారీ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరుపుతున్న సీబీఐ, ఎన్ ఫౌర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరికొన్ని బ్యాంకులకు కూడా నోటీసులు జారీ చేశారు.

ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ చంద కొచ్చర్ కు సమన్లు జారీ చేశారు. ఆమెను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మను కూడా విచారణకు పిలిచారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి ఎల్ఓయూ (లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్) తీసుకుని నీరవ్ కు ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర 15కు పైగా బ్యాంకులు, ముందూ వెనుకా చూడకుండా అప్పనంగా రుణాలిచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, ఈ స్కామ్ లో ఇప్పటివరకూ 16 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడీ స్కామ్ లో టాప్ బ్యాంకర్స్ ను సైతం ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించడం కలకలం రేపుతోంది. వీరిద్దరితో పాటు పలు ప్రైవేటు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలూ కూడా నోటీసులు అందుకోనున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles