Xiaomi Teases Redmi 5 Launch On The 14th Of March సస్పెన్స్ కొనసాగిస్తున్న షియోమీ.. 14న మరో అవిష్కరణ..

Xiaomi redmi 5 expected to launch in india on march 14

xiaomi india, redmi note 5, redmi note 5 pro, mi tv 4, mitv 4c,cash on delivery,xiaomi sale,xiaomi flash sale,xiaomi event,live stream,budget smartphone,dual camera,snapdragon 636,smartphone camera, e-commerce, smart phones, mobiles, technology, business

Xiaomi teases a new smartphone, which will be announced on the 14th of March. Hence, it seems like the Redmi 5 could be launched in India.

సస్పెన్స్ కొనసాగిస్తున్న షియోమీ.. 14న మరో అవిష్కరణ..

Posted: 03/08/2018 04:42 PM IST
Xiaomi redmi 5 expected to launch in india on march 14

రెడ్ ఎంఐ ప్లాగ్ షిప్ తో భారతీయ విఫణిలో సంచలనాలకు తెరతీస్తున్న చైనాకు చెందిన షియోమీ సంస్థ.. మరో నూతన ఉత్పాదనతో మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో అందులోనూ మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విభాగంలో రారాజులా వెలుగొందిన సామ్ సంగ్ ను వెనక్కి నెట్టి దూసుకుపోతున్న షియోమీ.. మరో నూతన స్మార్ట్ ఫోన్ ను ఈ నెల 14న దేశీయ విఫణిలో అవిష్కరించనుంది. ఇటీవలే రెడ్ ఎంఐ నోట్ 5, 5 ప్రోలను ఆవిష్కరించిన షియోమీ.. రెడ్ ఎంఐ 5ఏ మోడల్ ను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ఇలా నిత్యం తన నూతన అవిష్కరణలో భారతీయుల అదరణను చూరగోన్న ఈ సంస్థ..  నెల వ్యవధిలోనే రెండు టీవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టి.. టీవీల విక్రయాలలో కూడా తనదే పైచేయి సాధించాలని ఊవ్విళ్లూరుతుంది. ఈ క్రమంలో ఈ నెల 14న మరో స్మార్ట్ ఫోన్ ను షియోమీ సంస్థ విడుదల చేయబోతోంది. అది రెడ్ ఎంఐ 5ఏకి అదనపు ఫీచర్లతో వస్తున్న నూతన ఉత్పాదన లేక పూర్తిగా భిన్నంగా వస్తున్న మరొ నూతన స్మార్ట్ ఫోనా..? అన్న విషయంలో మాత్రం కంపెనీ ఇంకా రహస్యంగానే వుంచింది. అయితే అది రెడ్ మీ 5 కావచ్చని, లేదా మరో స్మార్ట్ టీవీ కావచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.

రెడ్ ఎంఐ 4కు తదుపరి జనరేషన్ మోడల్ 5గా రానుంది. 4ఏ మోడల్ స్థానంలో 5ఏను తీసుకురాగా, రెడ్ ఎంఐ 4, 2017 మోడల్ కు సమాంతరంగా మరో స్మార్ట్ ఫోన్ ను ఇంకా విడుదల చేయలేదు. కనుక ఈ నెల 14న ఆవిష్కరించే మోడల్ అదేనని భావిస్తున్నారు. రెడ్ ఎంఐ 5 మోడల్ లో 5.7 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 1.8 గిగాహెర్జ్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ నౌగత్ 7.1 వెర్షన్ ఓఎస్, ఎంఐయూఐ 9, 2జీబీ, 3జీబీ ర్యామ్, 16జీబీ, 32జీబీ వెర్షన్లతో ఈ మోడల్ ను కంపెనీ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇంకా 12 మెగా పిక్సల్స్ రియర్ కెమెరా, ఎల్ ఈ డీ ఫ్లాష్, ముందు భాగంలో 5మెగా పిక్సల్స్ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : xiaomi  red mi  red mi-5  mi tv  cash on delivery  e-commerce  smart phones  mobiles  technology  business  

Other Articles