చైనా మొబైల్ మేకర్ షియోమి రెడ్ ఎంఐ 5 ఎకు ధీటుగా స్వదేశీ మొబైల్ మేకర్ మైక్రోమాక్స్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఇవాళ భారతీయ విఫణిలోకి ప్రవేశపెట్టింది. భారీ బ్యాటరీతో బడ్జెట్ దరలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ కు భారత్ 5 అని నామకరణం చేసింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంఛ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేవలం రూ.5555 ధరకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ లాంచ్ లో వొడాఫోన్ తో భాగస్వామ్యంలో డేటాను కూడా ఆఫర్ చేస్తుంది.
ఈ ఆఫర్ ప్రకారం ఐదు మాసాల పాటు నెలకు 10 జీబి డాటాను కూడా అందించనుంది. భారత్-సీరీస్లో భారత్ 5 ప్లస్, భారత్ 5 ప్రోతో పాటు మరో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 2018 నాటికి 6 లక్షల యూనిట్లను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఫోన్లు దేశంలోని ఆఫ్ లైన్ రిటైలర్లు ద్వారా మాత్రమే అందుబాటులో వుండనున్నాయి. దీంతో రీటైల్ మార్కెట్లోనే కొనుగోలు చేయాల్సి వుంటుంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్, చీఫ్ మార్కెటింగ్ అండ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ షుబోడిప్ పాల్ మాట్లాడుతూ .. భారత్5 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో తరువాత దిశగా భారత్ ను తీసుకెళతాయని అశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విద్యుత్తు అంతరాయ సమస్యలను ఎదుర్కొంటున్న 3-4 టైర్ నగరాల్లో తమ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ డివైస్‌లు కీలకంగా నిలుస్తాయన్నారు. అయా నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో తమ నూతన ఉత్పాదనకు అదరణ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మైక్రోమ్యాక్స్ భారత్ 5 స్పెసిఫికేషన్లు:-
5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్
1.3GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ నౌగాట్
720x1280 పిక్సల్స్ రిజల్యూషన్
1జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
16జీబీదాకా విస్తరించుకునే సదుపాయం
5 మెగాపిక్సెల్ బ్యాంక్ అండ్ ఫ్రంట్ కెమెరాలు విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more