Honor9i with four cameras in India భారతీయ విఫణిలోకి నాలుగు కెమెరాలతో హానర్ 9ఐ

Bezel less honor9i with four cameras in india for rs 17999

Huawei, Honor9i, android, Honor9i india launch, Honor9i launched in india, Huawei, Honor9i specs, Honor9i price in india, Honor9i price, Honor9i battery, mobiles, smartphones, Indian market, Flipkart, E-commerce, business, technology

Huawei's sub-brand Honor launched Honor 9i smartphone with four cameras and bezel-less display -- the industry's first such device -- in India at Rs 17,999

భారతీయ విఫణిలోకి నాలుగు కెమెరాలతో హానర్ 9ఐ

Posted: 10/06/2017 09:40 PM IST
Bezel less honor9i with four cameras in india for rs 17999

భారతీయ మార్కెట్లోకి మరో వినూత్న స్పెసిఫికేషన్ తో సరికొత్త స్మార్ట్ ఫోన్ భారతీయ విఫణిలోకి వచ్చింది. అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత సెల్పీల ట్రెండ్ నేటి యువతలో పెరిగిపోవడంతో.. దానిని క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. ఇప్పటికీ వెనుక భాగంలో మాత్రమే వుండే సెల్ ఫోన్ నుంచి ముందుభాగంలోకి కెమెరాలు వచ్చేశాయి. ఈ తరువాత డ్యూయల్ రేర్ కెమెరాల పేరుతో ముందు ఒకటి వెనుక రెండు కెమెరాలతో కూడా చాలా ఫోన్లు వచ్చాయి.

ఈ క్రమంలో తాజాగా భారతీయ మార్కెట్లోకి వచ్చిన కోత్త ఫోన్ స్మార్ట్ ఫోన్ ప్రియులను వినూత్నంగా అకర్షిస్తుంది. ఇందుకు కారణం దీనికి ఏకంగా నాలుగు కెమెరాలు వుండటమే. చైనాకు చెందిన హుయావి సంస్థ తన సబ్ బ్రాండ్ హానర్ పేరుతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. హానర్‌ 9ఐ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ కు ముందు రెండు కెమెరాలు, వెనుక రెండు కెమెరాలు కలిగివుంది.

ప్రైమరీ కెమెరాతో ఫొటోలు తీస్తుండగా.. సెకండరీ కెమెరా ఫీల్డ్‌ ఎఫెక్ట్స్‌ను తీయడంలో ఉపయోగపడుతుందని సంస్థ వర్గాలు తెలిపాయి. భారతీయ మార్కెట్లో దీని ధర రూ.17,999గా సంస్థ యాజమాన్యం నిర్ధేశించింది. అయితే ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్డు ద్వారా ఈ నెల 14 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

స్పెషిఫికేషన్లు:-

5.9 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
4జీబీ ర్యామ్‌
64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
ముందువైపు 13 మెగాపిక్సెల్‌తో ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్‌తో సెకండరీ కెమెరా
వెనుకవైపు 16 మెగాపిక్సెల్‌తో ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్‌తో సెకండరీ కెమెరా
3340ఏంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Huawei  Honor9i  android  Indian market  Flipkart  E-commerce  business  technology  

Other Articles