RBI to print new Rs 100 notes from Apr 2018 వచ్చే ఏడాది రూ.100 నోట్ల ఉపసంహరణ.. వాటి స్థానంలో..

Rbi to print soon new rs 100 notes to boost lower denomination supply

Reserve Bank of India, central bank, rbi, rs 100 notes, new rs 100 notes, new rs 200 notes, remonetisation, demonetisation, note ban, finance ministry, shakti kanth das, arun jaitley, pm Modi, Narendra modi

The Reserve Bank of India, RBI, has given a further push to its plans to ensure enough cash supply in country through the widely promulgated remonetisation drive

వచ్చే ఏడాది రూ.100 నోట్ల ఉపసంహరణ.. వాటి స్థానంలో..

Posted: 10/03/2017 05:13 PM IST
Rbi to print soon new rs 100 notes to boost lower denomination supply

భారతీయ రిజర్వు బ్యాంకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో మునుపెన్నడూ లేని అత్యంత విలువైన రూ. 2000 నోటును నోట్ల రద్దు నేపథ్యంలో ప్రవేశపెట్టిన సెంట్రల్ బ్యాంకు ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక నివేదిక నేపథ్యంలో అర్థిక రంగానికి చెందిన నిపుణుల నుంచి విపక్ష నేతలతో పాటు.. పార్టీకి చెందిన సీనియర్ నేతలు కూడా విమర్శలు చేశారు. అర్బీఐ కొండను తవ్వి ఎలుకను పట్టిందని, నోట్ల ముద్రణకు వేల కోట్ల రూపాయలను వెచ్చించి అంతకన్న తక్కువ మొత్తంలో నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారన్న విమర్శలు కూడా గుప్పించారు.

నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో దేశ అర్థిక వృద్ది మందగించిందని పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర అర్థికమంత్రి యశ్వంత్ సిన్హా కూడా విమర్శించారు. అయినా కేంద్రంలోని మోదీ సర్కారు మాత్రం తమ ధోరణిని మార్చుకోవం లేదు. తాజాగా మరోమారు మరో నోటును ఉపసంహరించుకునేందుకు రెడీ అయ్యింది. ఏమిటీ నోటు అంటారా..? అదే రూ.100 నోటు. అయితే ఈ నోటును ఒక్కసారిగా కాకుండా క్రమంగా ఉపసంహరించేందుకు ప్రణాళిక వేశారు. ఇందుకు వచ్చే ఏడాది ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు.

వాటి స్థానంలో రీ డిజైన్ చేసిన కొత్త వందరూపాయల నోటును ప్రవేశపెట్టాలని ఆర్బీఐ నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చికల్లా కొత్త రెండు వందల రూపాయల నోట్లను మార్కెట్లోకి ప్రవేశ పెట్టడం పూర్తి చేసి కొత్తగా వంద రూపాయల నోట్లను ముద్రించాలని ఆర్బీఐ భావిస్తోంది. అయితే కొత్త వందరూపాయల నోటు సైజులో ఎలాంటి మార్పు చేయకుండా పాత నోటు సైజులోనే ముద్రించాలని ఆర్బీఐ అధికారులు నిర్ణయించారని అధికారవర్గాలు వెల్లడించాయి. కొత్త వందరూపాయల నోట్ల ముద్రణ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి చేపట్టాలని ఆర్బీఐ అధికారులు నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rbi  rs 100 notes  new rs 100 notes  new rs 200 notes  demonetisation  note ban  finance ministry  

Other Articles