Mukesh Ambani turns emotional paying tribute to father ఉచితంగా జియో 4జీ ఫోన్.. సెక్యూరిటీ డిఫాజిట్లు కూడా వెనక్కి..

Jiophone launched text of speech by mukesh ambani at launch

Reliance, Reliance Jio, Jio, Jio 4G, Jio 4G VoLTE, 4G VoLTE, Mukesh Ambani, RIL, Reliance Industries Limited, Lyf, Jio Lyf, Jio feature pone, Jio Rs 500 feature phone, 4G feature phone, RIL AGM, jio phone 1500, jio 4g phone 1500, jio 4g mobile, jio 1500 phone, jio 1500 rs phone, reliance jio 4g phone specification, jio feature phone specification, jio 4g phone, jio phone launch, jio phone 1500, jio 1500

Reliance chairman Mukesh Ambani on Friday announced the JioPhone, a hybrid between a feature phone and a smartphone. The device has been effectively priced at zero,

ఉచితంగా జియో 4జీ ఫోన్.. సెక్యూరిటీ డిఫాజిట్లు కూడా వెనక్కి..

Posted: 07/21/2017 07:16 PM IST
Jiophone launched text of speech by mukesh ambani at launch

రిలయన్స్ జియో విడుదల చేయనున్న సరికొత్త 4జీ ఫోన్ ను భారతీయులకు ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఒక స్మార్ట్ ఫోన్ ఎంట్రీ లెవల్ ధర రూ. 3,500 నుంచి రూ. 4 వేలుగా ఉన్న వేళ, తాను ఇండియన్స్ కోసం ఉచితంగానే ఫోన్ ను అందిస్తానని అన్నారు. అయితే కొత్త 4జీ ఫోన్ ను పొందేందుకు రూ. 1500 డిపాజిట్ గా చెల్లించాల్సి వుంటుందని, దీన్ని మూడేళ్ల తరువాత పూర్తిగా వెనక్కు ఇచ్చేస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించారు. భారతీయులందరికీ ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని, ఆగస్టు 15, 2017 భారతదేశ చరిత్రలో డిజిటల్ యుగాన్ని సరికొత్త మైలురాయికి చేరుస్తుందని ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు.

ఈ సందర్బంగా మరో అద్భుత ఆవిష్కరణ కూడా జరిగింది. జియో ఫోన్ టీవీ-కేబుల్ ను విడుదల చేస్తున్నట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు. కేవలం స్మార్ట్ టీవీలకు మాత్రమే కాకుండా, అన్ని రకాల టీవీలకూ ఇది పని చేస్తుందని, ఈ కేబుల్ ద్వారా స్మార్ట్ ఫోన్ డేటాతో టీవీ కార్యక్రమాలను, నచ్చిన సమయంలో నచ్చిన సినిమాలను, పాటలను టీవీ స్క్రీన్ పై వీక్షించవచ్చని, లైవ్ కార్యక్రమాలను చూడవచ్చని అన్నారు. నెలకు రూ. 309 చెల్లించడం ద్వారా ఈ ప్యాక్ ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. జియో ధన్ ధనా ధన్ ఆఫర్ లో ఉన్నవారు రోజుకు మూడు నుంచి నాలుగు గంటల పాటు టీవీలో కార్యక్రమాలను చూడవచ్చని అన్నారు.

రిలయన్స్ జియో ఉన్నంత కాలం వాయిస్ కాల్ కు ఒక్క పైసా కూడా వసూలు చేయబోనని ఆయన హామీ ఇచ్చారు. జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత రోజుకు 250 కోట్ల నిమిషాల కాల్స్ ను ఉచితంగా అందించామని, ఇకపైనా అలాగే జరుగుతుందని అన్నారు. అధునాతన సాంకేతికత దగ్గర చేస్తున్న సౌకర్యాలను తాను మారుమూల గ్రామాల ప్రజలకు అందిస్తానని స్పష్టం చేశారు. నెలకు 125 కోట్ల గిగాబైట్ల డేటాను తాము అందిస్తున్నామని, 65 కోట్ల వీడియో నిమిషాలను స్ట్రీమింగ్ చేస్తున్నామని ముఖేష్ పేర్కొన్నారు. మొబైల్ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను ఇండియా దాటేసిందని ప్రకటించేందుకు తనకెంతో గర్వంగా ఉందని చెప్పారు.

పది నెలల క్రితం జియో మార్కెట్లోకి రాకముందు మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవల విషయంలో 156వ స్థానంలో ఉన్న ఇండియా, ప్రస్తుతం తొలి స్థానానికి ఎదిగిందని ముఖేష్ ప్రకటించారు. మార్చి నుంచి డేటాకు నియమిత మొత్తాన్ని వసూలు చే్యడం ప్రారంభించిన తరువాత, అత్యధిక యూజర్లు పెయిడ్ కస్టమర్లుగా మారారని, ఇప్పుడు 10 కోట్లకు పైగా పెయిడ్ కస్టమర్లకు తాము సేవలందిస్తున్నామని తెలిపారు. ఎక్కువ మంది తామందిస్తున్న రూ. 309 ప్లాన్ తీసుకుంటున్నారని తెలిపారు. జియో ప్రైమ్ సభ్యులకు ధన్ ధనాధన్ ప్లాన్ ను కొనసాగిస్తామని అన్నారు. ముఖేష్ అంబానీ ప్రసంగం కొనసాగుతోంది.

కాగా, తన సంస్థ సాధించిన ప్రగతిని వివరిస్తూ ముఖేష్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా సంస్థను స్థాపించిన తన తండ్రిని తలచుకున్నారు. తన తల్లి సహకారంతో ఆయన వేసిన పునాది ఈనాడు ఇంతింతైవటుడింతై అన్నట్టు ఎదిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులను తల్చుకున్న ఆయన ఒక్క నిమిషం పాటు మాటలు అందక మౌనం దాల్చారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఉబికి వస్తున్న భావాలను దిగమింగి తన ప్రసంగం కొనసాగించారు. ఈ ఏజీఎంకు ముఖేష్ సతీమణి నీతా అంబానీ, తల్లి కోకిలాబెన్, కుమారుడు, కుమార్తె సహా పలువురు ప్రముఖులు, వీఐపీలు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles