దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ సబ్సిడరీ బ్రాండ్ వైయు మొబైల్స్ మరో నూతన ఉత్సాదనను మార్కెట్లో ప్రవేశపెట్టింది. వైయు యూనిక్ పేరుతో నూతన 4జీ స్మార్ట్ ఫోన్ ను దేశీయ అభిమానుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. మరింత మెరుగైన స్పెసిఫికేషన్లతో అత్యంత చౌకౌన దరకు దీనిని మార్కెట్లో ప్రవేశపెట్టింది. నూతన స్మార్ట్ ఫోన్ చౌకదరలో స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవాలనుకునే వారిని తప్పకుండా అకర్షిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది వైయూ మొబైల్స్ నుంచి వస్తున్న రెండో స్మార్ట్ ఫోన్ ఇది. ఇంతకుముందు వైయు యూరేకా పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ ను ఈ ఏడాది అరంభంలోనే తీసుకువచ్చిన విషయం తెలిసింది. ఇక దానితో పోల్చినా.. బడ్జెట్ ధరలో ట్రూ కాలర్ ఇంటిగ్రేషన్ తో పెద్ద డిస్ ప్లే, పెద్ద బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ ప్రియుల ముందుకు వచ్చింది యూనిక్. ఆండ్రాయిడ్ నౌగట్‌తో 4జీ తో ‘వైయు యూనిక్ 2’ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ. 5,999 గా కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ నెల 27 నుంచి ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది. డ్యూయల్ సిమ్ తో ఈ హ్యాండ్ సెట్‌ను అందిస్తోంది.
వైయు 'యునిక్ 2' స్పెసిఫికేషన్లు:-
5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్
1280 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ నౌగాట్ 7.0
మీడియా టెక్ మైక్రో 6737 క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మొమరీ
13ఎంపీ ప్రైమరీ కెమెరా ప్రాథమిక కెమెరా 4 ఆటో ఫోకస్, మల్టీ షాట్
5ఎంపీ సెకండరీ కెమెరా
ఎఫ్‌ఎం రేడియో
2500 ఎంఏహెచ్ బ్యాటరీ
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more