Samsung Galaxy Tab S3 With S Pen Stylus Launched సామ్ సంగ్ గెలాక్సీ ఎస్-3 ట్యాబ్ లాంచ్.. ఎస్ పెన్ అకర్షణ..

Samsung galaxy tab s3 with s pen stylus launched for rs 47 990

Samsung, Samsung Galaxy Tab S3, GalaxyTabS3, Indian market, launch, Additional Offers, details, Galaxy Note, launch, Launch Offers, price, Samsung, Samsung Galaxy, Samsung Galaxy Note, Samsung Galaxy Tab S3, specifications

Samsung has launched its Galaxy Tab S3 in India in an event in Bengaluru today. First unveiled at the MWC 2017 in Barcelona, the Galaxy Tab S3 comes with an S-Pen Stylus and features a new glass design in the Samsung Tab family.

సామ్ సంగ్ గెలాక్సీ ఎస్-3 ట్యాబ్ లాంచ్.. ఎస్ పెన్ అకర్షణ..

Posted: 06/20/2017 05:03 PM IST
Samsung galaxy tab s3 with s pen stylus launched for rs 47 990

ఎలక్ట్రానిక్ ఉత్పాదనల దిగ్గజ సంస్థ.. మెబైల్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న సామ్ సంగ్ కంపెనీ మరో కొత్త అవిష్కరణను భారతీయ విఫణిలో అవిష్కరించింది. కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల పీసీ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 3ని ఇవాళ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మార్కెట్లోకి విడుదల చేసింది. తొలుత బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో అవిష్కరింప జేసిన ఈ సరికొత్త ట్యాబ్ ను ఇవాళ భారతీయ విఫణిలోకి విడుదల చేసింది.

ఈ సరికొత్త గెలాక్సీ ట్యాబ్లో ఇప్పటివరకు సామ్ సంగ్ సంస్థ విడుదల చేసిన ఏ ఫోనులోనూ వినియోగించని నూతన అద్దాన్ని వినియోగించడంతో పాటు సరికొత్త డిజైన్ ను కూడా వాడుకలోకి తీసుకొచ్చింది. దీనికి తోడు ఎస్ పెన్ స్టైలస్ ను అందిస్తుంది. ఇక ఈ సరికొత్త ట్యాబ్ 9.7 అంగులాలతో సూపర్ అమోల్డ్ డిస్ ప్లేతో ట్యాబ్ ప్రియులను అకర్షిస్తుంది. ఇక దీని హెచ్ డీ ఆఱ్లోనే వీడియోను ప్లేబ్యాక్ ఫీచర్లు కలిగివుండటం గమనార్హం.

క ఈ ట్యాబ్ విడుదల సందర్బంగా సామ్ సంగ్ సరికొత్తగా పలు అఫర్లను కూడా ప్రకటించింది. ఈ ట్యాబ్ ను కొనుగోలు చేసూ రిలయన్స్ కస్టమర్లు నెలకు 28 జిబీ తో పాటు అదనంగా మరో రెండు జీవి డాడాటను కేవంల రూ.309 కే వినియోగించుకోవచ్చు. ఇక దీంతో పాటు ట్యాబ్ బుక్ కవర్ ను కూడా కేవలం రూ.2999లకే అందించనున్నట్లు తెలిపింది. కీబోర్డు కవర్ తో పాటు అందించేందుకు రూ.8499 అపర్ ను ప్రకటించింది. వీటికి తోడు సామ్ సంగ్ ట్యాబ్ ధ్వంసంమైన సందర్భంలో ఏడాది లోపు వారంటీ వుంటే వాటిని కేవలం రూ.990కే రీప్లేస్ చేస్తామని సంస్థ అఫర్లు ప్రకటించింది.

గెలాక్సీ ట్యాబ్ ఎస్3 ఫీచర్లు
9.7 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
2048 x 1536 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.15 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
డ్యుయల్ బ్యాండ్ వైఫై, వైఫై డైరెక్ట్, యూఎస్‌బీ టైప్ సి
6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samsung  Samsung Galaxy Tab S3  GalaxyTabS3  Indian market  launch  

Other Articles