Samsung Galaxy Note 8 With 6GB RAM, Dual Rear Cameras డ్యూయల్ కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 8..?

Samsung reveals dual camera sensor that might make its debut on galaxy note 8

samsung galaxy note 8 dual cameras 6gb ram september launch pricing specifications colours samsung galaxy note 8 launch date, samsung galaxy note 8 price, samsung galaxy note 8 features, samsung galaxy note 8 specifications, galaxy note 8 launch, galaxy note 8 price, mobiles, android, samsung

Samsung hasn’t confirmed that the Note 8 will feature a dual-camera setup, but based on the renders, the likelihood of this happening is quite high.

డ్యూయల్ కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 8.. ఫీచర్లు ఇవేనా..?

Posted: 06/28/2017 07:51 PM IST
Samsung reveals dual camera sensor that might make its debut on galaxy note 8

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంస్థ సామ్ సంగ్‌ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ ఎస్‌8, ఎస్‌ 8 ప్లస్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో త్వరలో గెలాక్సీ నోట్ 8 ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. గెలాక్సీ నోట్‌ 7తో కొంత నెగిటివ్ టాక్ మూటగట్టుకున్న సామ్ సంగ్.. తాజాగా గెలాక్సీ నోట్ 8 మోడల్ తో విజయాలను, అంతే సరిసమానంగా విక్రయాలను కూడా రాబట్టుకోవాలన్న యోచనలో వుంది. అయితే గెలాక్సీ నోట్ 8 కు సంబంధించిన కొన్ని చిత్రాలు లీక్‌ కావడంతో ఈ మోడల్ లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

సామ్ సంగ్ గెలాక్సీ నోట్‌ 8 మోడల్ డ్యూయల్‌ కెమెరా సాంకేతికతతో రాబోతున్నట్లు స్పష్టమవుతుంది. అయితే డ్యూయల్ కెమెరాతో వస్తున్న తొలి మొబైల్‌ ఇదేనని ఈ మోడల్ పై అంచనాలు పెరుగుతున్నాయి. వెనకవైపు డ్యూయల్ కెమెరాల పక్కన ఫింగర్ ప్రింట్‌ సెన్సార్ ను అమర్చారు. స్పీకర్స్, యూఎస్‌బీ సి టైప్‌ పోర్ట్‌, ఎస్ పెన్ స్లాట్‌, ఆడియో జాక్ కింద భాగంలో ఉన్నాయి. బెజెల్ లెస్ డిస్ ప్లేతో ఈ ఫోన్ ను రూపొందిస్తున్నట్లు సమాచారం. 6.3 అంగుళాల స్క్రీన్ సైజుతో ఉండొచ్చని చెబుతున్నారు.

స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ లేదా ఎక్సినోస్ ప్రాసెసర్ ను ఉపయోగించే అవకాశం ఉంది. 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండొచ్చని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాటరీని 3300 ఎంఏహెచ్ కు పరిమితం చేసే అవకాశం ఉంది. వేగవంతమైన ఛార్జింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ తో తొందరగా ఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది. సెప్టెంబర్ లో గెలాక్సీ నోట్ ‌8ను విడుదల చేసే అవకాశం ఉందని.. అయితే సామ్ సంగ్ ఫోన్లలోనే అత్యధికంగా దీని ధర భారీ స్థాయిలో రూ.72వేల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 8 ఫీచర్లు ఇలా వుండవచ్చు

ర్యామ్‌: 6 జీబీ
ప్రాసెసర్‌: క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌ లేదా ఎక్సినోస్
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
డ్యూయల్ కెమెరా
6.3 ఇంచుల స్క్రీన్ బెజెల్‌ లెస్‌ డిస్‌ప్లే
ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఫీచర్స్‌
యూఎస్‌బీ సి టైప్‌ పోర్ట్‌
ఎస్‌ పెన్‌ స్లాట్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samsung  samsung galaxy note 8  android  technology  phones  smartphones  google  

Other Articles