వేగంగా పుంజుకున్న జీడీపీ.. భవిష్యత్ అందోళనకరం.. India's GDP grows 7.3% in September quarter

Q2 gdp growth at 7 3 but pm modi s demonetisation clouds future outlook

narendra modi, demonetisation, india gdp, black money, old rs 500 note, old rs 1000 note, currency crisis, september quarter gdp, india gdp rate

India can ill-afford to take much pride in having the world’s fastest growing large economy when it releases September quarter data

వేగంగా పుంజుకున్న జీడీపీ.. భవిష్యత్ అందోళనకరం..

Posted: 11/30/2016 06:43 PM IST
Q2 gdp growth at 7 3 but pm modi s demonetisation clouds future outlook

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు దేశ, విదేశీ అర్ధిక వేత్తలు అందరూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ప్రగతి కుదేలవుతుందని అందోళన వ్యక్తం చేయడం, అటు వృద్ధి రేటుపై పోటు పడుతుందని పలు రేటింగ్ సంస్థలు అంచనా వేస్తున్న నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జీడీపీ ఫలితాలు రానే వచ్చాయి. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాస వృద్ది రేటులో భారత్ వేగంగా పుంజుకుంది.

జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో జీడీపీ రేటు 7.3 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. గత క్వార్టర్లో ఈ రేటు 7.1 శాతంగా ఉంది. గత త్రైమాసికం కంటే ఈ త్రైమాసికంలో దేశీయ ఎకానమీ శరవేగంగా వృద్ధి చెందినట్టు ఈ గణాంకాల్లో తెలిసింది. అదేవిధంగా ఈ రేటు పెంపుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీలో భారత్ ఒకటిగా మరోసారి రుజువు చేసుకుంది. కానీ నవంబర్ 9 నుంచి హఠాత్తుగా రద్దైన పాత రూ.500, రూ.1000 నోట్ల వల్ల దేశమంతటా నగదు సమస్య ఏర్పడిందని, ఇది వచ్చే నెలల్లో వృద్ధిరేటు ప్రభావం చూపవచ్చని విశ్లేషకులంటున్నారు.
 
ఈ ఆర్థికసంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటును అత్యధికంగా 8 శాతం నమోదుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ హఠాత్తుగా పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడంతో సమీప కాలంలో వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుందని పలు రేటింగ్ సంస్థలు సైతం అంచనావేస్తున్నాయి. 2017-18 ఆర్థికసంవత్సర వృద్ధి రేటు అంచనాలను కుదిస్తూ వస్తున్నాయి. కరెన్సీరద్దు స్వల్పకాలంలో ప్రభావం చూపినా.. దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని అవి పేర్కొంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  demonetisation  india gdp  currency crisis  business  

Other Articles