రెండు వారాల గరిష్టానికి ఎగసి.. పడిన సెన్సెక్స్.. Sensex surges 44 points at close, Nifty up 15 points

Sensex at two week high up 44 points in choppy trade

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

Equity benchmarks hit two-week highs intraday, but late sell-off forced the Sensex to pare gains and the Nifty to end below 8150 level.

రెండు వారాల గరిష్టానికి ఎగసి.. పడిన సెన్సెక్స్..

Posted: 11/29/2016 06:48 PM IST
Sensex at two week high up 44 points in choppy trade

డిసెంబర్ మాసం డెరివేటివ్ల సిరీస్ ప్రారంభంలో వరుసగా మూడు రోజు లాభాల బాటలో పయనించిన మార్కెట్లు ఇవాళ్టి ట్రేడింగ్ లో భాగంగా రెండు వారాల గరిష్టస్థాయిని అందుకుని మళ్లీ కిందకు జారాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు వంద పాయింట్లకు పైగా లాబాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో రెండు వారాల గరిష్ట స్థాయిని కూడా చేరుకుంది.

అయితే వచ్చిన లాభాలను అధిపట్టుకోవడంలో విఫలమైన మార్కెట్లు.. చివరి సెషన్ లో అమ్మాకాల ఒత్తిడికి లోనయ్యాయి. మరీ ముఖ్యంగా ఎఫ్ఎంజీసీ, టెక్నాలజీ, బ్యాంకింగ్ రంగంలో షెర్లు అమ్మకాల ఒత్తడికి గురయ్యాయి. ఈ తరుణంలో ముగింపు సమయానికి సెన్సెక్స్ 44 పాయింట్లు లాభంతో 26 వేల 394 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 8వేల 142 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈ నేపథ్యంలో అటో, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీలు భారీ లాభాల్లో పయనించాయి. వీటితో పాటు మధ్యతరహా, చిన్న తరహా పరిశ్రమల సమాఖ్యల సూచీలు, క్యాపిటల్ గూడ్స్ కూడా లాభాలను అందుకున్నాయి. ఇక బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, మెటల్స్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ క్రమంలో ఏషిర్ మోటార్స్, ఐడియా సెల్యూలార్, మారుతి సుజుకీ, బాస్చ్, గెయిల్ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, హిండాల్కో, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, బిపిసిఎల్; ఐటీసీ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles