పెరిగిన టోకు ధరల సూచీ.. నష్టాల బాటపట్టిన స్టాక్ మార్కెట్లు.. Sensex, Nifty sluggish: August WPI inflation rises to 3.74%

Sensex nifty sluggish august wpi inflation rises to 3 74

sensex, nifty, indian share market, indian stock exchange, wholesale price index, inflation, August, food prices, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, wholesale price index, inflation, August, food prices, sensex, nifty, indian share market, indian stock exchangeanet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Wholesale Price Index inflation increased to 3.74 percent in the month of August compared with 3.55 percent in preceding month.

పెరిగిన టోకు ధరల సూచీ.. తటస్థంగా స్టాక్ మార్కెట్లు..

Posted: 09/14/2016 06:42 PM IST
Sensex nifty sluggish august wpi inflation rises to 3 74

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల బాట పట్టాయి. టోకు ధరల సూచీ అధారిత ద్రబ్యోల్భణం పెరగిందని గణంకాలు ప్రకటించగానే అప్పటి వరకు స్వల్ప లాభాలలో పయనిస్తున్న మార్కెట్లు తిరోగమనం బాట పట్టాయి. సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్న ప్రభావం ఏమాత్రం లేకుండా తటస్థంగా సాగుతున్న మార్కెట్లలో టోకు ధరల సూచీ గణంకాలు దెబ్బతీశాయి. జూలై నెలలో 3.55 శాతానికి ఎగబాకి మార్కెట్ వర్గాలను నిరాశపరిచిన ఈ ద్రవ్యోల్బణం, మళ్లీ ఆగస్టు నెలలో 3.74 శాతానికి ఎగిసింది.

అయితే ఈ పెరుగుదల తక్కువగానే నమోదైంది. ప్రభుత్వం  బుధవారం విడుదలచేసిన తాజా డేటాలో ఈ విషయం వెల్లడైంది. జూలై నెలలో 11.82శాతంగా ఉన్న ఆహార ధరల ఇండెక్స్ ఆగస్టు నెలలో 8.23 శాతంగా నమోదైంది. డబ్ల్యూపీఐలో ఎక్కువ శాతం కలిగి ఉన్న తయారీ ఉత్పత్తుల ధరలు ఆగస్టు నెలలో 2.42 శాతం ఎగిశాయి. జూలైలో ఈ ధరలు 1.82 శాతంగా ఉన్నాయి. గతవారంలో విడుదల చేసిన వినియోగదారుల ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో ఐదు నెలల కనిష్టానికి పడిపోయి రేట్ల కోతకు అవకాశం కల్పించగా ఈ ద్రవ్యోల్బణం కొంత నిరాశపరిచింది.

ఆగస్టు నెల టోకు ధరల సూచీ ధ్రవ్యోల్భణం ప్రభావం మార్కెట్ వర్గాలపై కూడా ప్రస్పూటించింది. గణాంకాలు విడుదల కాగానే మధ్యహ్నం సెషన్ నుంచి మార్కెట్లు పడిపోయాయి. పలితంగా సెన్సెక్స్ 28 వేల 350 మార్కుకు ఎగువన ముగియగా, అటు నిఫ్టీ కూడా కీలకమైన 8750 మార్కుకు దిగువన ట్రేడింగ్ ముగించింది. ఈ నేపథ్యంలో మార్కెట్ ముగిసే సమయానికి తటస్థంగా వుంది. సెన్సెక్స్ 19 పాయింట్ల లాభంతో 28,353 వద్ద ముగియగా, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో  8,726 వద్దకు ముగించింది.

ఈ తరుణంలో ఐటీ, టెక్నాలజీ రంగాలకు చెందిన సూచీలు మినహా అన్ని రంగాల షేర్లు లాభాల భాట పట్టాయి. అటో, బ్యాకింగ్, బ్యాకింగ్ నిఫ్టీ, కన్జూమర్ డ్యూరబుల్, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమల సూచీలు భారీ లాభాలను అందుకోగా, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, ఎఫ్ఎంజీసీ రంగాలకు చెందిన సూచీలు స్వల్ప లాభాలను గడించాయి. ఈ క్రమంలో బ్యాంక్ అఫ్ బరోడా, యస్ బ్యాంక్, ఏసీసీ, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ తదితర సంస్థల షేర్లు లాభాలను గడించగా, బాస్చ్, కోట్ ఇండియా, టీసీఎస్, ఓఎన్జీసీ, హెచ్ యు ఎల్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles