Indian shares fall nearly 2% on Fed rate hike jitters

Sensex dives 444 points biggest single day drop since brexit

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

The benchmark BSE Sensex tanked over 500 points to 28,251 on weak global cues. 29 of 30 index stocks were in the red.

కుప్పకూలిన మార్కెట్లు.. బ్రెగ్జిట్ అనంతరం అతిపెద్ద పతనం

Posted: 09/12/2016 06:09 PM IST
Sensex dives 444 points biggest single day drop since brexit

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి. సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలతో దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం నుంచి నష్టాలను ఎదుర్కొన్న సూచీలు మిడ్ సెషన్ సమయంలో కాస్తా కొద్దిగా కోలుకున్నాయి. అయినా ముగింపు సమయానికి నష్టాలు ఒక్కసారిగా కుదిపేయడంతో చివరకు భారీ నష్టాలతో పతనమయ్యాయి. పలితంగా సెన్సెక్స్ 28 వేల 2350 మార్కుకు ఎగువన ముగియగా, అటు నిఫ్టీ కూడా కీలకమైన 8750 మార్కుకు దిగువన ట్రేడింగ్ ముగించింది.

ఈ నేపథ్యంలో మార్కెట్ ముగిసే సమయానికి భారీ కుదుపులకు గురైన మార్కెట్ నష్టాల ఊభిలోకి కూరుకుపోయింది. సెన్సెక్స్ ఏకంగా 443 పాయింట్ల నష్టంతో 28,353 వద్ద ముగియగా, నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో  8,715, వద్దకు దిగజారాయి. బ్రెగ్జిట్ సంక్షోభం తర్వాత ఇదే భారీ పతనమని మార్కెట్ల  వర్గాలు  అంచనా వేశాయి. ప్రధానంగా అన్ని రంగాల సూచీలు నష్టాల బాట పడ్డాయి. మిడ్‌ సెషన్‌ నుంచీ పెరిగిన అమ్మకాలతో బ్యాంక్ సెక్టార్ భారీగా పతనం కాగా, ఐటీ సెక్టార్ లాభాలను ఆర్జించింది..  ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలు కూడా మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి.

దీంతో రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీల్లో  అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆటో, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలు కూడా ఇదే బాట పట్టాయి.  హిందాల్కో బీవోబీ, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, యస్‌బ్యాంక్‌,  అంబుజా, టాటా పవర్‌, ఏసీసీ, స్టేట్‌బ్యాంక్‌, భెల్‌ నష్టపోగా, ఇన్ఫోసిస్‌, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌  లాభపడ్డాయి. అమెరికా మందగమనం, బ్రెక్సిట్‌ వంటి అంశాల కారణంగా ఇటీవల నీరసించిన ఈ రంగంలో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడం దీనికి కారణమని నిపుణులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles