Xiaomi Redmi 3S India Launch Set for Wednesday

Xiaomi redmi 3s to launch in india tomorrow

xiaomi redmi 3s, xiaomi redmi 3s specs, xiaomi redmi 3s launch, xiaomi, redmi 3s price, redmi 3s, redmi 3s launch, redmi 3s launch in india, redmi 3s features, xiaomi latest phones, redmi latest phones, technology, technology news

Xiaomi's Redmi 3s, the company's next smartphone for India, will be launched tomorrow at a special event.

భారతీయ విఫణీలోకి షియోమీ రెడ్‌మి సిరీస్‌ కోత్త స్మార్ట్ ఫోన్

Posted: 08/02/2016 04:38 PM IST
Xiaomi redmi 3s to launch in india tomorrow

చైనా యాపిల్‌గా పేరొందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ షియోమి నుంచి భారతీయ విఫణిలోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ మరికోద్ది గంటల్లో అందుబాటులోకి వచ్చేస్తుంది. భారతీయ స్మార్ట్ ఫోన్ అభిమానుల మనసు దోచుకునేందుకు షియోమి నుంచి రెడ్‌మి సిరీస్‌లో మరో కొత్త ఫోన్ త్వరలోనే అవిష్కరించనుంది. తొలుత రెడ్‌మి 1ఎస్, తర్వాత 2ఎస్‌లను రిలీజ్ చేసిన ఈ సంస్థ.. తాజాగా రెడ్‌మి 3ఎస్ ఫోన్‌ను తీసుకొస్తోంది.

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మరికోద్ది గంటల్లో భారతీయ మార్కెట్లలోకి వచ్చేస్తోంది. ఈ కొత్త ఫోన్ ధర రూ. 10వేల లోపే ఉంటుందని టెక్నాలజీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కంపెనీ మాత్రం దీని ధర ఎంతో ఇంకా చెప్పలేదు. అయితే పోటీ ప్రపంచంలో తమ ప్రత్యర్థులకు పోటీనిస్తూ.. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో వుండేట్టుగా ఈ ఫోన్ ధర వుంటుందని సమాచారం. రెడ్‌మి సిరీస్‌లో 2, 2ప్రైమ్ తర్వాత వస్తు్న్న ఈ ఫోన్‌ను తొలుత చైనా మార్కెట్లో విడుదల చేశారు.
 
ఫోన్ ఫీచర్లు ఇవీ..
ప్రాసెసర్ - క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430
ర్యామ్ - 2 జీబీ
స్క్రీన్ - 5 అంగుళాల డిస్‌ప్లే
వెనక కెమెరా - 13 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరా - 5 మెగాపిక్సెల్
బ్యాటరీ - 4100 ఎంఏహెచ్
ఇంటర్నల్ మెమొరీ - 16 జిబి
ఆండ్రాయిడ్ వెర్షన్ - 5.1 లాలిపాప్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : xiaomi  redmi 3s  smartphone  Indian market  Technology news  

Other Articles