Maruti Suzuki Alto 800 facelift launched

Maruti s alto 800 gets facelift

maruti suzuki, alto 800, new launch, Maruti Suzuki, India, Maruti upgrades Alto 800, maruti alto 800 facelift vs renault kwid vs datsun redi-go vs hyundai eon,maruti alto 800 facelift vs renault kwid,maruti alto 800 facelift vs datsun redi-go,maruti alto 800 facelift vs hyundai eon,hyundai

The Alto is unrivalled in terms of its annual sales numbers and has been the highest selling car in India for the last 12 years.

మరింత నవ్యంగా రూపుదిద్దుకుని మార్కెట్లోకి వచ్చిన మారుతి..

Posted: 05/19/2016 08:59 PM IST
Maruti s alto 800 gets facelift

మధ్యతరగతి వర్గాల కారుగా పేరొందిన మారుతి అల్టో కారు మరింత నవ్యంగా రూపుదిద్దుకుని వాహన ప్రియులను అలరించేందుకు  సిద్ధంగా ఉంది. మరోసారి దాదాపు 3  లక్షల లోపు కారును అందుబాటులోకి తీసుకొస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.  అవును..ఆటోమొబైల్ దిగ్గజం మారుతి  సుజుకి  తన హ్యాచ్ బ్యాక్ మోడల్   ఆల్టో 800  అప్ గ్రేడేడ్ వెర్షన్   బుధవారం విడుదల చేసింది.  ఆల్టో 800కు మెరుగులు దిద్దుతూ కొత్త వెర్షన్‌ని  ఢిల్లీలో  రిలీజ్ చేఇంది.  దీని ప్రారంభ ధరను రూ.2.49 లక్షలుగా పేర్కొంది.

ఈ కొత్త ఆల్టో 800 అన్ని వేరియంట్లలో డ్రైవర్‌ ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించడం ప్రధాన ఆకర్షణగా నిలచింది. దీంతోపాటుగా  వెలుపలి భాగాన్ని ఆకర్షణీయంగా  రూపొందించి,  కేబిన్‌లో మరింత స్థలాన్ని కేటాయించింది.  పెట్రోల్‌, సీఎన్‌జీ వెర్షన్‌లలో  మొత్తం ఆరు రంగుల్లోఅందుబాటులో ఉంటుందని తెలిపింది. మేలైజీని 10 శాతం మెరుగుపర్చినట్టు పేర్కొంది. సీఎన్‌జీ ( కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) వేరియంట్‌ ధర (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) రూ.3.70 లక్షలు, ఎయిర్ బ్యాగ్ ఉన్న సీఎన్జీ  కారును 3.76 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ  వెల్లడించింది.

796సీసీ సామర్ధ్యంతో మూడు సిలెండర్ల ఉన్న పెట్రోల్‌ ఇంజిన్‌, 5 స్పీడ్‌ మ్యాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ దీని ప్రత్యేకతలు.  పెట్రోల్‌ మోడల్‌ లీటరుకి 24.7 కి.మీ. మైలేజ్‌ ఇవ్వనుండగా, సీఎన్‌జీ రకం లీటరుకి 33.44 కి.మీ.మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ చెప్పింది. భద్రతాపరంగా చూస్తే. కారు వినియోగదారుల సౌలభ్యంకోసం అధునాతన  రూపొందించామని మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  ఆర్ ఎస్ కల్పి ఒక ప్రకటనలో తెలిపారు. మెరుగైన డ్రైవింగ్ కోసం అద్భుతమైన మైలేజీకోసం తమ ఇంజనీర్లు ఇంజిన్ నిర్మాణాన్ని అభివృద్ధి చేశారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maruti Suzuki  launch  refurbished  version  Alto 800  

Other Articles