Negative global cues, profit booking dent equity markets

Sensex sheds 69 points auto shares fall

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

SBI, Lupin, ONGC, L&T and Tata Steel are top gainers while Bajaj Auto, M&M, Hero MotoCorp, HDFC Bank and BHEL are losers in the Sensex.

విదేశాల ప్రతికూల పవనాలు.. నష్టాల్లో మార్కెట్లు

Posted: 05/18/2016 05:06 PM IST
Sensex sheds 69 points auto shares fall

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను ఎదుర్కోన్నాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి ముఖ్యంగా గూడ్స్ అండ్ సర్విసెస్ టాక్స్ బిల్లుకు అమోదం లభించకపోకుండానే పార్లమెంటు సమావేశాలు ముగియడం కూడా మార్కెట్లు పతననాకి కారణమని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు సెన్సెక్స సహా ఇటు నిఫ్టీ కూడా నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 69 పాయింట్ల నష్టాన్ని ఎదర్కోగా, అయితే ఇటు నిఫ్టీ మాత్రం బెంచ్ మార్క్ 7850 మార్కుకు ఎగువ స్థాయినే నిలబెట్టుకుంది.

మార్కెట్లు ముగిసే సమయానికి 0,27 శాతం నష్టాన్ని చవిచూసిన సెన్సెక్స్ 69 పాయింట్ల నష్టంతో 25 వేల 705 పాయింట్ల వద్దకు చేరుకుంది. నిఫ్టీ కూడా 21 పాయింట్ల నషంతో 7 వేల 870 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది, కాగా ఇవాళ ఉదయం నుంచి దేశీయ సూచీలు అటుపోట్లను ఎదుర్కోని కుదుపులకు గురవుతున్నాయి. మొత్తంగా 2,734 కంపెనీల షేర్లు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,241 కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించగా, 1,314 కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. కాగా 179 కంపెనీల షేర్లు తటస్థంగా నిలిచాయి.

ఇవాళ్లి ట్రేడింగ్ లో అటో రంగ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. దాని ప్రభావంతో బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ, అయిల్ అండ్ గ్యాస్, టెక్నాలజీ, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య సూచీలు నష్టాలను ఎదుర్కోకున్నాయి, మరోవైపు మద్యతరహా పరిశ్రమ సూచీ నిఫ్టీ, మెటెల్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, హెల్త్ కేర్, చిన్న తరహా పరిశ్రమల సూచీలు ఎప్ ఎం జీ సీ రంగాల షేర్లు లాభాల భాటలో పయనించాయి. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ, ఎస్ బి ఐ, లుపిన్, లార్సెన్, హెచ్ సి ఎల్ టెక్  తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, బాస్చ్, జీ ఎంటర్ టైన్మెంట్, హీరో మెటార్ కార్పోరేషన్, బజాజ్ అటో, బిపిసీఎల్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.    

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles