Late rally in heavyweights lifts Sensex 164 pts, Nifty above 7850

Sensex recovers hits highest close in a week

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Indian shares rose on Monday, recovering from an earlier fall of 0.5 percent as gains in a few blue chips

క్రితం వారంత నష్టాల నుంచి తేరుకున్న దేశీయ సూచీలు..

Posted: 05/16/2016 04:29 PM IST
Sensex recovers hits highest close in a week

ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను అర్జించాయి, క్రితం వారాంతంలో చవిచూసిన నష్టాల నుంచి త్వరగానే తేరుకున్న దేశీయ సూచీలు లాభాలను గడించాయి. ఈ నేపథ్యంలో అటు సెన్సెక్స సహా ఇటు నిఫ్టీ కూడా అర శాతం మేర లాభాలను గడించాయి. ఉదయం మార్కెట్లు స్వల్ప నష్టాలను ఎదుర్కొన్నాయి. ఆ తరువాత చివరి క్షణంలో వచ్చిన లాభాలు మార్కెట్లను లాభాల బాటలో పయనింపజేశాయి. ఫలితంగా సెన్సెక్స్ 25 వేల 650 మార్కుకు ఎగువన, అటు నిఫ్టీ కూడా బెంచ్ మార్క్ 7850 మార్కుకు ఎగువకు చేరుకున్నాయి.

ఫలితంగా మార్కెట్టు ముగిసే సమయానికి మార్కెట్లు దేశీయ సూచీలు లాభాలను గడించాయి. సెన్సెక్స్ 164 పాయింట్ల లాభంతో 25 వేల 653 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ
కూడా 46 పాయింట్ల లాభంతో 7 వేల 860 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది, మొత్తంగా 2,739 కంపెనీల షేర్లు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,302 కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించగా, 1,263 కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. కాగా 174 కంపెనీల షేర్లు తటస్థంగా నిలిచాయి.

ఇవాళ్లి ట్రేడింగ్ లో అటో, బ్యాంకింగ్ నిఫ్టీ, ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, ఐటీ, మెటల్స్, టెక్నాలజీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సూచీలు లాభాలను అర్జించగా, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, అయిల్ అండ్ గ్యాస్, బ్యాంకెక్స్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీలు నష్టాలను చవిచూశాయి. కాగా, ఐటీ, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమల సూచీలతో పాటు ఎఫ్ ఎం జీ సీ, సూచీలు స్వల్ప నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్, ఇన్ ఫ్రా టెల్, బోష్ లిమిటెడ్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఇన్ఫ్రాటెల్ తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, సిప్లా, అదానీ పోర్ట్స్, ఐడియా సెల్యులార్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles