India's gold demand falls 39% in Q1-2016 to 116.5 tonnes: World Gold Council

India s gold demand falls sharply in march quarter says world gold council

India,India gold demand falls,India jewellery gold demand,WGC,gold prices in india,gold imports by india,jewellers strike,excise duty on gold,gold companies in India,titan,tanishq,TBZ,Pc jeweller,budget excise duty on gold

A 19-day strike in March over re-introduction of one excise duty on certain categories of jewellers hit India's gold demand during the March 2016 quarter, says World Gold Council.

భారీగా తగ్గిన బంగారం డిమాండ్.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్

Posted: 05/14/2016 11:39 AM IST
India s gold demand falls sharply in march quarter says world gold council

భారత్‌లో పసిడి డిమాండ్ 2016 జనవరి నుంచి ప్రారంభమైయ్యే తొలి త్రైమాసికంలో భారీగా పడిపోయింది. బంగారం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన అంక్షలు భారత్ లో డిమాండ్ తగ్గేందుకు కారణమయ్యాయని సమాచారం. లక్ష రూపాయలు, అంతకన్నా ఎక్కువ విలువైన బంగారం  కొన్నాలంటే తప్పకుండా ప్యాన్ కార్డ్ వినియోగించాలన్న అదేశాలు జారీ చేయడంతో దానిని వ్యతిరేకిస్తూ బంగారం వర్తకులు చేపట్టిన సమ్మె ప్రభావం బంగారం డిమాండ్ పై పడింది.

2015 ఇదే కాలంలో డిమాండ్ 192 టన్నుల డిమాండ్ ఉంటే- 2016 ఇదే కాలంలో ఈ డిమాండ్ 39 శాతం తగ్గి 117 టన్నులకు పడిపోయింది. వెండి యేతర ఆభరణాలపై ఒకశాతం ఎక్సైజ్ సుంకం విధింపు, దీనిని నిరసిస్తూ ఆభరణాల వర్తకుల సమ్మె వంటి కారణాలు పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు ‘డిమాండ్ ధోరణులపై’ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. నివేదికలోని మరిన్ని అంశాలను చూస్తే...

* విలువ రూపంలో డిమాండ్ 36 శాతం పడింది. రూ.46,730 కోట్ల నుంచి రూ.29,900 కోట్లకు తగ్గింది.
* త్రైమాసికంలో ఆభరణాలకు డిమాండ్ 150.8 టన్నుల నుంచి 88.4 టన్నులకు(41%) పడిపోయింది. విలువ రూపంలో డిమాండ్ 38% పడిపోయి రూ.36,761 కోట్ల నుంచి రూ. 22,702 కోట్లకు తగ్గింది.
* ఇక పెట్టుబడులకు డిమాండ్ 31 శాతం తగ్గి 40.9 టన్నుల నుంచి 28 టన్నులకు పడింది. ఈ డిమాండ్ విలువ రూపంలో 28 శాతం తగ్గి రూ.9,969 కోట్ల నుంచి రూ.7,198 కోట్లకు తగ్గింది.
* ఈ ఏడాది మొదటినుంచీ ధర తీవ్రంగా పెరగడం, ఎక్సైజ్ సుంకాలు తగ్గిస్తారన్న అంచనాలూ డిమాండ్‌పై ప్రభావం చూపాయి.
* రూ.2 లక్షలు దాటిన కొనుగోళ్లకు పాన్ కార్డ్ వినియోగం తప్పనిసరి అన్న నిబంధన సైతం డిమాండ్ తగ్గడానికి కారణం.

గ్రామీణ ప్రాంతాల్లో భారీ వ్యయాలకు తగిన బడ్జెట్, తగిన వర్షపాతం అవకాశాలు వంటి అంశాలు తిరిగి పసిడి డిమాండ్‌ను పటిష్ట స్థాయికి తీసుకువస్తాయన్న విశ్వాసాన్ని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్  పేర్కొంది. ఈ ఏడాది పసిడి డిమాండ్ 850 నుంచి 950 టన్నుల శ్రేణిలో నమోదవుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా రీసైక్లింగ్ గోల్డ్ 18 టన్నుల నుంచి 14 టన్నులకు పడింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold  traders strike  World Gold Council report  

Other Articles