Sensex, Nifty end 1% down; infra, banks, metals skid

Sensex tanks over 300 points on weak global cues

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Adani Ports, HUL, HDFC, ICICI Bank and GAIL are losers while Asian Paints, ITC and Tata Motors are gainers in the Sensex.

విదేశీ మార్కెట్ల ఎఫెక్ట్.. వారంతంలో భారీ నష్టాల్లో సూచీలు

Posted: 05/13/2016 04:01 PM IST
Sensex tanks over 300 points on weak global cues

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల ప్రభావంతో వారాంతంలో దేశీయ సూచీలు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి 0.1 శాతం మేర తగ్గినట్టు ఫలితాలు వెల్లడవ్వడం కూడా మార్కట్లను కుదుపుకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో అటు సెన్సెక్స సహా ఇటు నిఫ్టీ కూడా ఒక శాతం మేర నష్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన సమయం నుంచే మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి, ఫలితంగా సెన్సెక్స్ 25 వేల 500 మార్కుకు దిగువన, నిఫ్టీ కూడా 7850 మార్కుకు దిగువకు జారుకున్నాయి.

ఫలితంగా మార్కెట్టు ముగిసే సమయానికి మార్కెట్లు మరింత నష్టాన్ని మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 301 పాయింట్ల నష్టంతో 25 వేల 489 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 86 పాయింట్ల నష్టంతో 7 వేల 815 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది, ఇవాళ్లి ట్రేడింగ్ లో రమారమి అన్ని సూచీలు నష్టాల బాటలో పయనించాయి. బ్యాంక్, బ్యాంకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, అటో, హెల్త్ కేర్, మెటల్స్ సహా పలు సూచీలు భారీగా నష్టాలను ఎదురున్నాయి.

కాగా, ఐటీ, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమల సూచీలతో పాటు ఎఫ్ ఎం జీ సీ, సూచీలు స్వల్ప నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్, టాటా మెటార్స్, ఎన్టీపీసీ తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, అదాని పోర్టులు, హెచ్ యు ఎల్; టాటా స్టీల్, హెచ్ డీ ఎప్ సీ, బిహెచ్ఇఎల్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.    

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles