Gold soars to highest level in 15 months amid dollar, equity sell-off

Gold price surges to largest weekly gain in 11 weeks

Business, Markets, GOLD, Gold price, Gold rate, silver price, silver rate, Finance, Mercantile,Exchange

Gold prices surged to the largest weekly gain of the past 11 weeks on the heels of the Fed doing nothing.

రెండేళ్ల గరిష్టస్థాయికి స్వర్ణం.. పైపేకి పరుగులు పెడుతున్న పసిడి

Posted: 04/30/2016 06:51 PM IST
Gold price surges to largest weekly gain in 11 weeks

అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కాస్త మందగమనంతో సాగుతున్న పసిడి ధరలు మన దేశంలో మాత్రం పరుగులు పెడుతున్నాయి, దేశ రాజధానిలో పసిడి ధర (10 గ్రాములు) చూస్తుండగానే రూ.30,000 మార్క్‌ను అధిగమించింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి.  బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం, అమెరికా ఫెడ్ కూడా వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం, డాలర్ విలువ పది నెలల కనిష్టానికి చేరడం తదితర కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి ధరలు పెరిగాయి. దీనికి తోడు దేశంలో జువెలర్స్ నుంచి డిమాండ్ పెరగడం కూడా ఇక్కడి పసిడి ధరల పెరుగుదల ఒక కారణ మయ్యాయి.

ప్రపంచ మార్కెట్‌లో కడపటి సమాచారంమేరకు పసిడి ధర ఔన్స్‌కు 1,295 డాలర్లకు పెరిగింది. వెండి ధర 1.7 శాతం పెరుగుదలతో 17.84 డాలర్లకు చేరింది. వెండికి గతేడాది జనవరి నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల 99.9%, 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ధరలు రూ.350 పెరుగుదలతో వరుసగా రూ.30,250కు, రూ.30,100కు చేరాయి. 2014, మే 13 నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. అలాగే పరిశ్రమలు సహా నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర (కిలో) కూడా రూ.600 పెరుగుదలతో రూ.41,600కు ఎగసింది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  GOLD  Gold price  Gold rate  silver price  silver rate  Finance  Mercantile  Exchange  

Other Articles