Sensex, Nifty end lower; banks & IT drag, metals gain

Sensex falls to three week low on disappointing results

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Hindalco, BHEL, GAIL, Cipla and Lupin are top gainers while ICICI Bank, Dr Reddy's, Adani Ports, Bharti Airtel and ITC are losers in the Sensex.

మూడువారాల కనిష్టస్థాయికి మార్కెట్లు.. 7800 దిగువన నిఫ్టీ

Posted: 05/02/2016 04:05 PM IST
Sensex falls to three week low on disappointing results

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను చవిచూశాయి. ఇవాళ్టి నష్టాలతో మార్కెట్లు మూడు వారాల కనిష్టస్థాయికి మార్కెట్లు దిగజారాయి. ఇవాళ ఉదయం ప్రారంభం నుంచే మార్కెట్లు తిరోగమనంలో పయనిస్తున్నాయి. మార్కెట్లు ముగిసేవరకు ఏక్కడినుంచైనా సానుకూల పవనాలు వస్తాయని ఆశించిన మదుపరుల ఆశలు అడియాశలయ్యాయి. ఇవాళ మార్కెట్లలో దాదాపుగా అన్ని సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి.

ఈ నేపథ్యంలో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్ 25 వేల 500 మార్కుకు దిగువన, నిఫ్టీ 7800 మార్కుకు కొద్దిగా ఎగువన ముగిసాయి. సెన్సెక్ 170 పాయింట్లను నష్టపోయి 25 వేల 436 మార్కు వద్ద ట్రేడింగ్ ముగించగా, అటు నిఫ్టీ కూడా 44 పాయింట్లు కోల్పోయి 7 వేల 806 పాయింట్ల వద్ద ముగసింది. కాగా ఇవాళ్టీ ట్రేడింగ్ లో 1291 సంస్థలకు చెందిన షేర్లు లాభాల బాటలో పయనించగా, 1313 సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. కాగా 115 సంస్థల షేర్లు మాత్రం తటస్థంగా వున్నాయి. అన్ని సూచీలు నష్టాల బాటలోనే పయనించగా, 740 సంస్థల షేర్లు లాభాలను నమోదు చేసుకోగా, 1942 సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇవాళ్లి ట్రేడింగ్ లో బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, ఐటి, టెక్నాలజీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ సూచీలు నష్టాలను ఎదుర్కోగా, కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్స్, మధ్యతరహా పరిశ్రమల సూచీలు లాభాలను అర్జించగా, అయిల్ అండ్ గ్యాస్, చిన్న తరహా పరిశ్రమల సూచీలు, ఎఫ్ఎంజీసీ సూచీలు కొద్దిపాటి లాభాలను అర్జించాయి. ఈ నేపథ్యంలో గెయిల్, హిండాల్కో, బిహెచ్ఇఎల్, మారుతి, హీరో మోటార్ కార్పోరేషన్ సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, ఐసిఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, భారతి ఎయిర్ టెల్, అదాని పోర్టు మరియు ఎస్ బి ఐ సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.    

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles