Sensex closes 94 points up in a volatile trade, Nifty50 settles at 7,510

Europe oil rally helps sensex rebound 95 pts

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

BSE Sensex and NSE Nifty advanced on Friday tracking a recovery in Asian markets and buying in oil and gas stocks after the government announced crucial reforms for the oil and gas sector.

లాభాల్లో మార్కెట్లు.. 7500 మార్కుకు ఎగువన నిఫ్టీ

Posted: 03/11/2016 06:30 PM IST
Europe oil rally helps sensex rebound 95 pts

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిసాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ప్రారంభమైన లాభాల మద్యలో ఒక రోజు మినహా మళ్లీ అందుకున్నాయి.  విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు కేంద్రం చమురు రంగంలో తీసుకువచ్చిన సవరణలతో అప్పటి వరకు నష్టాల బాటలో పయనించిన మార్కెట్లు, మద్యాహ్నం నుంచి లాభాలను అందుకున్నాయి, ముఖ్యంగా ఐరోపా మార్కెట్ నుంచి వచ్చిన సానుకూల పవనాలు మార్కెట్లను లాభాలలోకి తీసుకెళ్లాయి.

సెషన్ ఆరంభం నుంచే తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ సూచీలు స్వల్ప లాభాలు నమోదు చేసుకున్నాయి. ఇవాళ్లి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 94.65 పాయింట్లు పెరిగి 0.38 శాతం లాభంతో 24,717.99 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 24.05 పాయింట్లు పెరిగి 0.32 శాతం లాభంతో 7,510.20 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.08 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.16 శాతం నష్టపోయింది. ఎన్ఎస్ఈ-50లో 27 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి.

 కెయిర్న్ ఇండియా, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ పోర్ట్స్, లుపిన్, జడ్ఈఈఎల్ తదితర కంపెనీలు లాభపడగా, ఐడియా, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టాటా స్టీల్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి.
బీఎస్ఈలో మొత్తం 2,725 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,100 కంపెనీలు లాభాల్లోను, 1,464 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. గురువారం నాడు రూ. 91,64,974 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 91,82,859 కోట్లకు పెరిగింది.    

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles