Sensex Posts Biggest Gain in 29 Months, Nifty Settles Above 7200

Hopes of rate cut positive asian cues swell equity markets

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Benchmark indices BSE Sensex and NSE Nifty surged over 3 per cent on Tuesday after buying gained momentum across sectors led by FMCG, banks and industrials amid hopes of a repo rate cut after the presentation of the Union Budget 2016.

రికార్డుస్థాయి లాభాలను అందుకున్న దేశీయ సూచీలు

Posted: 03/01/2016 06:58 PM IST
Hopes of rate cut positive asian cues swell equity markets

కేంద్ర బడ్జెట్ తర్వాత దలాల్ స్ట్రీట్‌లో మెరుపులు మెరిశాయి. ఆరంభం నుంచి లాభాల్లో కొనసాగిన మార్కెట్లు తమ హవాను చివరి వరకు కొనసాగించాయి. ఒకదశలో 800  పాయింట్లకు పైగా ర్యాలీ అయింది. ఉరుకులు పరుగులు పెడుతూ రికార్డుస్థాయి లాభాలను నమోదు చేసింది. గత ఏడేళ్లలో ఒకరోజులో అత్యధిక లాభాలను ఆర్జించిన ఘనతను సెన్సెక్స్ మంగళవారం సాధించింది.  2009  సం.రం తర్వాత అత్యధిక లాభాలను ఆర్జించడం ఇదే మొదటిసారి. ముగింపులోనూ జోరును కంటిన్యూ చేసిన సెన్సెక్స్  777  పాయింట్ల  లాభంతో  23,779.35 దగ్గర, నిఫ్టీ 235 పాయింట్ల లాభంతో  7,222 దగ్గర ముగిసింది.

ఆసియా, ఐరోపా మార్కెట్ల సానుకూల సంకేతాలు ఆరంభ జోరుకు మరింత మద్దతునిచ్చాయి. ఈ భారీ లాభాల్లో ముఖ్యంగా ఎఫ్ఎంసిజి, ఆటో, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాలు  ప్రధాన భూమికను పోషించాయి. 4.87 శాతం లాభాలను ఆర్జించి మార్కెట్‌ను లీడ్ చేశాయి. అలాగే నిప్టీ  కీలకమైన మద్దతు స్థాయి 7,200  దగ్గర  స్థిరంగా క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో బలంగా ఉన్న  భారత కరెన్సీ విలువ కూడా దేశీయ మార్కెట్ లోని సూచీలను ప్రభావితం చేసిందని ఎనలిస్టులు అభిప్రాయపడ్డారు.

2016-17  ఆర్థిక సంవత్సరానికి జీడీపి వృద్ధిరేటుపై ప్రభుత్వ అంచనాలు మార్కెట్ల మూడ్‌ను పాజిటివ్‌గా మార్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ ఆధారిత ప్రతిపాదనలు.. కొనుగోళ్లకు  ఊతమిచ్చాయంటున్నారు.  దాదాపు రూ 36,000 కోట్ల కేటాయింపు ప్రకటన, ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంపై ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించారని  బ్రోకర్లు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles