Sensex closes 463 points up led by gains in banking stocks, Nifty settles above 7,350

Bull run continues on indian bourses

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

The bull run on Indian stock markets continued for the second straight day on Wednesday, with the mood lifted by perception that the national budget has some reforms push, as also by strong showing in other Asian markets and overnight gains in US and Europe

స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు.. 27 వేల మార్కును దాటిన సెన్సెక్స్

Posted: 03/02/2016 05:54 PM IST
Bull run continues on indian bourses

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండవ రోజు భారీ లాభాలలో పయనించాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు ఆసియా మార్కెట్ల నుంచి లభించిన అనుకూల ధోరణి దేశీయ సూచీల ర్యాలీని కొనసాగించేలా చేసింది. ముఖ్యంగా అమెరికా, ఐరోపా మార్కెట్ల అందించిన సానుకూల పవనాలు మదుపరులను కొనగోళ్లకు అసక్తి చూపేందుకు దోహదం చేశాయి. అయితే అదే క్రమంలో ఆసియా మార్కెట్ల నుంచి అందిన అనుకూల పవనాలు దేశీయ సూచీలను వేగం పుంజుకునేలా చేశాయి.

దీనికి తోడు అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రభావంతో ఆర్బీఐ త్వరలో సమీక్షించనున్న ద్రవ్య పరపతి విధానంలో అనుకూల సవరణలకు దోహదం చేస్తాయని భావించిన మదుపరులు కోనుగోళ్లకు అసక్తి కనబర్చడంతో మార్కట్లు లాభాలను స్వీకరించాయి. సెన్సెక్స్ 24 వేల మార్కును ధాటగా, అటు నిఫ్టీ కూడా 7, 350 మార్కును దాటింది. ఇవాళ ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 375 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ సాగించాయి. ఉదయం నుంచి వచ్చిన లాభాలను ఒడిసి పట్టకున్న మార్కెట్లు ముగింపు సమయానికి మరిన్ని లాభాలను అందుకున్నాయి.

సెన్సెక్స్ 464 పాయింట్ల లాభంతో 24,243 వద్ద ముగియగా, నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో  7,3690 వద్ద ట్రేడ్ అయ్యింది. బ్యాంకింగ్ రంగ సెక్టార్లు అత్యధికంగా ఏకంగా 12 శాతం లాభాలను అందుకున్నాయి. కాగా ఒక్క ఎఫ్ఎంజీసీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల భాటలో పయనించాయి. ఎస్బీఐ, ఐసిఐసిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ అఫ్ బరోడా, హిండాల్కో సహా పలు సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, మహింద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఐటీసీ, బజాజ్ అటో సహా పలు సంస్థల షేర్లు అధికంగా నష్టాలను చవిచూశాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles